నల్ల మిరియాలతో బరువుకు చెక్.. నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు!
మనం ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేసే వాటిలో మనం ఇంట్లో నిత్యం వినియోగించే మసాలా దినుసులు ఎంతో బాగా పనిచేస్తాయి. వాటిల్లో నల్ల మిరియాలకు ఉన్న స్థానం అంతా ఇంతా కాదు. నల్లమిరియాలలో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. నల్ల మిరియాలను ప్రతిరోజు మన డైట్ లో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి వాటిని గురించి ప్రస్తుతంతెలుసుకుందాం.
నల్ల మిరియాలలో ఫుల్ పోషకాలు
నల్ల మిరియాలలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి తో పాటు సెలీనియం ఉంటుంది. నల్ల మిరియాల లో పెప్పరిన్ అనే ఖనిజాలు ఉంటాయి. ఈ పెప్పరీన్ మన శరీరం మెటబాలిజం రేటును పెంచుతుంది. శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది. బరువు తగ్గాలని భావించే వారికి నల్ల మిరియాలు బరువు తగ్గడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

నల్ల మిరియాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు
నల్లమిరియాలను ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. నల్ల మిరియాలు తినడం వల్ల కడుపులో అజీర్తి, గ్యాస్, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఇక నల్ల మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ రాకుండా కాపాడుతుంది. ఫ్రీ రాడికల్ డామేజ్ కాకుండా నివారిస్తుంది. నల్లమిరియాలు గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. కాన్సర్ రాకుండా నిరోధిస్తాయి.
సీజనల్ వ్యాధులు, ఆస్తమా నుండి కాపాడే నల్ల మిరియాలు
నల్ల మిరియాలలో ఉండే పోషకాలు మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. నల్ల మిరియాల లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. నల్లమిరియాలను డైట్ లో భాగంగా చేర్చుకోవడం వల్ల సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి.ఆస్తమా, బ్రోన్కైటీస్ వ్యాధులు ఉన్నవాళ్లు నల్లమిరియాలను తమ డైట్లో భాగంగా చేసుకుంటే మంచిది.
వృద్ధాప్యం త్వరగా రాకుండా నల్ల మిరియాలతో చెక్
నల్ల మిరియాలు మన చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా చేస్తాయి. నల్ల మిరియాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మం యవ్వనంగా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న నల్లమిరియాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకొని అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications