Red Wine:రెడ్ వైన్‌లో కూల్‌డ్రింక్స్, సోడా కలిపి తాగుతున్నారా?
ఈ ప్రపంచంలో లెక్కలేనని మద్యం బ్రాండ్స్ ఉన్నాయి. వీటిలో రెడ్ వైన్ ఒకటి. బ్రాందీ, విస్కీ తాగలేనివారు ఈ రెడ్ వైన్ తాగుతుంటారు. ఇది మంచి ఆరోగ్యాన్నిస్తుందని వైద్యులు కూడా చెబుతున్నారు. అయితే మిగతావాటిలా దీన్ని తాగడం కుదరదు. దీన్ని తాగే విధానం పూర్తి భిన్నంగా ఉంటుంది. చాలామంది రెడ్ వైన్ తాగేటప్పుడు కూల్ డ్రింక్స్, సోడా కలుపుకోవాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉంటారు.
మనదేశంలో మద్యం సేవించే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఎక్కువ మంది నీరు, సోడా, కూల్ డ్రింక్స్ కలుపుకొని తాగుతుంటారు. రెడ్ వైన్‌ను హై క్లాస్ వైన్ అంటారు. సాధారణ మద్యం కంటే ఖరీదెక్కువ. అందుకే తక్కువమందే తాగుతుంటారు. ఇది ఎంత పాతదైతే ధర అంత ఎక్కువగా ఉంటుంది. రెడ్ వైన్ లో సోడా, నీరు, కూల్ డ్రింక్స్ కలుపుకోవడంవల్ల ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉంది.

ఆల్కహాల్ తాగడమే ఆరోగ్యానికి హానికరం. మళ్లీ అందులో సోడా లాంటివి కలుపుకొని తాగడమంటే ఆరోగ్యానికి మరింత హాని చేయడమే. సోడాలో కార్బన్ డయాక్సైడ్, ఫాస్పోరిక్ యాసిడ్ ఉంటాయి. ఇది శరీరంలోని కాల్షియంను నెమ్మది నెమ్మదిగా విచ్ఛిన్నం చేస్తుంది. ధ్వంసమైన కాల్షియం మూత్రం ద్వారా శరీరం నుండి బయటకు వస్తుంది. తర్వాత ఎముకలు బలహీనపడటం ప్రారంభిస్తాయి. సోడాతో పోలిస్తే కూల్‌డ్రింక్స్‌లో షుగర్ లెవెల్స్ ఎక్కువ. కెఫిన్ పరిమాణం కూడా వీటిల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. డీహైడ్రేషన్, హ్యాంగోవర్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications