ధనియాల దెబ్బకు రోగాలు పరార్!

మనం ఇంట్లో ఉపయోగించే ఆహార దినుసులలో ధనియాలు ఒకటి. వంటల్లో ధనియాలకు ఉండే ప్రాముఖ్యత అంతా కాదు. ధనియాలు అనేక అనారోగ్య సమస్యలకు మంచి దివ్య ఔషధంలా పనిచేస్తాయి. మన శరీరానికి కావలసిన ఆరోగ్య ప్రయోజనాలను ధనియాలు ఇస్తాయి. ఇక ధనియాలు మనకు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ధనియాలతో డయాబెటిస్ మాత్రమే కాదు వీటికి చెక్
ధనియాలు మధుమేహాన్ని నివారించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. మధుమేహం రాకుండా ధనియాలు కాపాడుతాయి. ధనియాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి ధనియాల పొడిని ఒక గ్లాసు నీళ్లల్లో మరిగించి చల్లార్చి తీసుకుంటే ఎంతో బాగా పనిచేస్తుంది.

Coriander seeds gives many health benefits reduces diabetes and weight

ధనియాలతో లివర్ ఆరోగ్యం
ధనియాలు రోజు తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ధనియాలు మన లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మలబద్దకాన్ని నివారిస్తాయి. అనేక చర్మ సమస్యలను తగ్గించడంలో ధనియాలు కీలకంగా పనిచేస్తాయి. గజ్జి, దురదలు, దద్దుర్లు, వాపులు వంటి వాటిని ధనియాలు తగ్గిస్తాయి.

ధనియాలతో కొలెస్ట్రాల్ కు చెక్
అధిక బరువుతో బాధపడేవారు ధనియాల నీళ్లను తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ధనియాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడానికి కూడా ధనియాలు ఉపయోగపడతాయి.

ధనియాలతో ఆరోగ్యమే కాదు అందం కూడా
రక్తస్రావం అధికంగా అవుతున్నవారు ధనియాల నీళ్లను మరిగించి తేనె లేదా పటిక బెల్లం కలుపుకుని తాగితే రక్తస్రావం తగ్గి పీరియడ్స్ నార్మల్ గా వచ్చే అవకాశం ఉంటుంది. ధనియాలు మన శరీరంలోని ప్రీ రాడికల్స్ ని ఎదుర్కోవడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. మన శరీర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ధనియాలు ఉపయోగపడతాయి.

ఆరోగ్యానికి ధనియాలు వరం
ధనియాలు మన జీర్ణవ్యవస్థను కాపాడతాయి. ధనియాలు మన బరువు తగ్గడానికి ప్రధానంగా దోహదం చేస్తాయి. ధనియాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అందుకు తగినట్టు మనం ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆరోగ్యానికి ధనియాలు నిజంగా వరం అని చెప్పాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+