Health News: మొక్కజొన్న లాభాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..
మొక్కజొన్న..దాదాపు దీన్ని తినని వారు ఉండరు. దాదాపు ప్రతి ఒక్కరు మక్క కంకులు తింటారు. మొక్కజొన్నలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మొక్కజొన్నతో చేసిన ఆహార పదార్థాలు తిన్నా మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. మొక్కజొన్న గింజలు తినటం ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తుంది. ఒక కప్పు పచ్చి మొక్కజొన్న గింజల్లో 125 కాలరీలు ఉంటాయి. 27 గ్రాముల కార్బోహైడ్రేట్లు.. 4 గ్రాముల ప్రొటిన్లు, 9 గ్రాముల షుగర్, 2 గ్రాముల ఫ్యాట్, 75 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది.
విటమిన్ బి12
మొక్కజొన్నలో విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి దేహంలో ఎర్రరక్త కణాలను ఉత్పత్తికి ఎంతో ఉపయోగపడతాయి. రక్తహీనత (ఎనీమియా) ముప్పు రాకుండా తగిన మోతాదులో న్యూట్రియంట్లను సరఫరా చేయడంలో మొక్కజొన్న సాయపడుతుంది. మొక్కజొన్నను కంకులుగా వున్నప్పుడే వాటిని తినేయవచ్చు లేదా మసాలాలు, కారాలు కూడా తగిలించి తినొచ్చు.

రైబోఫ్లోవిన్
మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి1, బి6, నియాసిన్, రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఉందని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ తెలిపింది. అథ్లెటిక్ క్రీడాకారులకు, జిమ్‌లో చెమటలు చిందించేవారికి ఇది శక్తిదాయకంగా పనిచేస్తుంది. మొక్కజొన్నలో బి విటమిన్ కుటుంబానికి చెందిన బి1, బి5లతో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. మొక్కజొన్నలో ఉండే కార్బొహైడ్రేట్లు జీర్ణం కావడానికి అధిక సమయం పడుతుందట.
పీచు
మొక్కజొన్నలో పీచు పుష్కలంగా ఉంటుంది. పీచు ఎక్కువుగా ఉండడం వల్ల జీర్ణక్రియకు తోడ్పడుతుంది. మలబద్ధకం సమస్య కూడ తగ్గుతుంది. మొక్కజొన్న తినడం వల్ల పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. మక్కల్లో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. మొక్కజొన్నలో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది ఎముకలు గట్టిపడేలా చేస్తుంది. మెుక్కజొన్నలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతిమంతంగా ఉంచడమేకాదు... శరీరంపై ముడతలు రాకుండా చేస్తాయట.












Click it and Unblock the Notifications