ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏవి మంచివంటే..!

మనందరం సాధారణంగా గేదె పాలనే ఎక్కువగా తీసుకుంటుంటాం. అందరూ వాటికే ప్రాధాన్యతనివ్వడంతోపాటు రైతులు కూడా పాడి పరిశ్రమ కింద గేదెలనే పెంచుతుంటారు. అయితే గేదె పాలతోపాటు ఆవు పాలలోను అనేక పోషకాలుంటాయి. ఆవు పాలు, గేదె పాలు.. రెండూ మంచివేనని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే మనం వ్యక్తిగతంగా ఎంచుకునే ప్రాధాన్యతను బట్టి ఆధారపడివుంటుందంటున్నారు. ఈ రెండింటి పాల మధ్య ఉన్న తేడాను ఒకసారి తెలుసుకుందాం.

కొవ్వు శాతం
గేదె పాలు: ఆవు పాలకంటే ఎక్కువ కొవ్వును కలిగి ఉంటాయి. అందుకే ఇవి చిక్కగా ఉండటంతోపాటు ఎక్కువ కేలరీలను కలిగి ఉంటాయి.
ఆవు పాలు: తక్కువ కొవ్వును కలిగి ఉండటంతోపాటు తేలికగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

Cow s milk or buffalo s milk which of these two is better

ప్రోటీన్
గేదె పాలు: ఆవు పాల కంటే కొంచెం ఎక్కువ ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి.
ఆవు పాలు: ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది.. సులభంగా జీర్ణమవుతుంది.

కాల్షియం
గేదె పాలు: ఆవు పాల కంటే ఎక్కువ కాల్షియంను కలిగి ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం.
ఆవు పాలు: ఇవి కూడా మంచి కాల్షియంను కలిగివుంటాయి.

విటమిన్లు
గేదె పాలు: విటమిన్ బి కాంప్లెక్స్, ఇతర ఖనిజాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి.
ఆవు పాలు: గేదె పాల కంటే విటమిన్ ఎ ఎక్కువగా కలిగి ఉంటాయి.

జీర్ణక్రియ
గేదె పాలు: ఎక్కువ కొవ్వు ఉండటం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు.
ఆవు పాలు: తేలికగా జీర్ణమవుతాయి. బలహీనమైన జీర్ణశక్తి ఉన్నవారికి ఇది మంచిది.

నిల్వ
గేదె పాలు: ఎక్కువ పెరాక్సిడేజ్ యాక్టివిటీ కలిగి ఉండటం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
ఆవు పాలు: త్వరగా పాడైపోతాయి. 1-2 రోజుల్లో ఉపయోగించాలి.

గేదె పాలు కోవా, పెరుగు మరియు పనీర్ వంటి ఉత్పత్తుల తయారీకి బాగా సరిపోతాయి. ఆవు పాలు నేరుగా తాగడానికి, స్వీట్ల తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారు.
సాధారణంగా ఆవు పాలు తేలికగా జీర్ణమవుతాయి కాబట్టి పిల్లలకు, వృద్ధులకు మంచిది. ఆవు పాలలో తక్కువ కొవ్వు, కేలరీలు ఉంటాయి కాబట్టి ఇది మంచి ఎంపిక.
గేదె పాలు ఎక్కువ కొవ్వు, కేలరీలను కలిగి ఉంటాయి కాబట్టి ఎక్కువ శక్తి కావాలనుకున్నవారికి మంచిది. గేదె పాలలో ఎక్కువ కాల్షియం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+