టెంపుల్ స్టైల్‌లో ఇంట్లోనే టేస్టీగా "దద్దోజనం" ఎలా చేయాలంటే..?

దద్దోజనం.. దక్షిణ భారతీయుల ఆహారంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సంప్రదాయ వంటకం. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దద్దోజనానికి విశేష ప్రాధాన్యత ఉంది. దేవతలకు నైవేద్యంగా సమర్పించే ఈ ఆహారం.. ముఖ్యంగా శ్రావణ మాసంలో అమ్మవార్ల పూజలలో తప్పనిసరిగా ఉంటుండి. పండుగలు, శుభకార్యాలు, భోజనాల చివర దద్దోజనం వడ్డించడం ఆనవాయితీగా వస్తుంది.
అంతే కాకుండా దద్దోజనం ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ సులభంగా జీర్ణమయ్యే ఆహారం కావడం దీని మరో విశేషం.

కాగా దద్దోజనంలో ప్రొటీన్, కాల్షియం, విటమిన్ బి12 వంటివి పుష్కలంగా ఉంటాయి. దీనిలోని పెరుగు శక్తివంతమైన ప్రొబయోటిక్స్‌ను కలిగి ఉంటుంది, ఇవి జీర్ణక్రియను మెరుగుపరచి, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా వేసవికాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే శక్తి కూడా దీనికి ఉంది. కడుపు సమస్యలు, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలకు ఇది సహజమైన పరిష్కారంగా పనిచేస్తుంది. ఇంట్లోనే ఆలయ రుచిని అందించే దద్దోజనాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అయితే కొందరికి ఆలయాల్లో ప్రసాదంగా పెట్టే దద్దోజనం అంటే బాగా ఇష్టం ఉంటుంది. ఇంట్లో చేస్తే సరిగ్గా తినని వారు కూడా ఆలయాల్లో బాగా తింటారు. అందుకే టెంపుల్ స్టైల్లో ఇంట్లోనే టేస్టీగా "దద్దోజనం" ఎలా చేయాలో తెలుసుకుందాం..

daddojanam-making-recipe-in-telugu-as-temple-prasadam-style

తయారీకి కావలసిన పదార్థాలు..

అన్నం

పెరుగు

పచ్చిమిర్చి

కరివేపాకు రెమ్మలు

అల్లం (చిన్న ముక్క)

ఆవాలు

జీలకర్ర

పచ్చి శనగ పప్పు

కొత్తిమీర (చిన్న కట్ట)

నెయ్యి లేదా నూనె

ఎండుమిర్చి

ఉప్పు

ఇంగువ

తయారీ విధానం..

  • ముందుగా ఉడికించిన అన్నాన్ని మెత్తగా కలుపుకోవాలి. అన్నం ఎంత మృదువుగా ఉంటే దద్దోజనం అంత రుచిగా ఉంటుంది. ( సన్నని బియ్యం కన్నా, దొడ్డు బియ్యాన్ని వాడటం వల్ల పెరుగన్నం మరింత అద్భుతంగా తయారవుతుంది)
  • ఇప్పుడు కలిపి పెట్టుకున్న అన్నంలో తగినంత ఉప్పు, చిటికెడు ఇంగువ వేసి బాగా కలిపి రెండు నిమిషాలు పక్కన పెట్టాలి.
  • తరువాత తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టి, అందులో నూనె లేదా నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి.
  • అది వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చి శనగ పప్పు, మినప పప్పు కొద్దిగా వేసి వేగనివ్వాలి. ఇందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఎండుమిర్చి వేసి, పోపు మాడిపోకుండా సన్నని మంటపై వేయించాలి.
  • పోపు కాస్త వేగిన తర్వాత, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి చిటపటలాడనివ్వాలి.
  • అనంతరం చిటికెడు ఇంగువ వేసి వేయించాలి. అప్పుడు వేయించిన పోపు మిశ్రమాన్ని నేరుగా పెరుగు కలిపిన అన్నంలో వేసి బాగా కలపాలి.
  • చివరగా సన్నగా తురిమిన కొత్తిమీర చల్లితే.. టేస్టీ టేస్టీ దద్దోజనం రెడీగా ఉంటుండి.

అయితే కొందరు దద్దోజనం తయారీలో దానిమ్మ గింజలు, ద్రాక్ష పళ్లు, సన్నగా తరిగిన యాపిల్ ముక్కలు వంటివి కూడా కలుపుతారు. ( ఇది పూర్తిగా వారి వారి అభిరుచిని బట్టి ఉంటుంది ).

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+