ఈ స్వీటు తింటే బరువు తగ్గుతారు!
మారుతున్న పనివేళలు, భోజన సమయాలతో ఊబకాయం వచ్చి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువసేపు కూర్చోవాల్సి రావడం కూడా నేటి యువతకు ఇబ్బందికరంగా పరిణమించింది. శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి వ్యాయామంతోపాటు డైటింగ్ కూడా చేస్తున్నారు. అయితే అనుకున్న రీతిలో ఫలితాలు రాకపోతుండటంతో వీరికి ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. సాధ్యమైనంతవరకు బరువు తగ్గడానికి తీపి పదార్థాలకు దూరంగా ఉంటుంటారు. అయితే స్వీట్లు తినడంవల్ల కూడా బరువును తగ్గించుకోవచ్చనే విషయం తెలుసా? అది తెలిస్తే ఆశ్చర్యపోతారు. డార్క్ చాక్లెట్ తింటే సులువుగా బరువు తగ్గుతారు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
* బరువు తగ్గడానికి డార్క్ చాక్లెట్ తినవచ్చు. అయితే మితంగానే తీసుకోవాలి. ఒక రోజులో మధ్యాహ్న భోజం, రాత్రి భోజనం తర్వాత రెండు చాక్లెట్ ముక్కలను తినవచ్చు. దీని వల్ల స్వీట్లు తినాలనే కోరిక తీరడంతోపాటు జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఉంటారు. అందుకే లంచ్ లేదా డిన్నర్ తర్వాత డార్క్ చాక్లెట్ తీసుకోవాలి.
* డార్క్ చాక్లెట్ స్మూతీ లేదంటే మిల్క్ షేక్ తయారు చేసి తాగొచ్చు. దీనికోసం కప్పు పాలలో 2 క్యూబ్స్ చాక్లెట్ వేసి షేక్ చేసిన తర్వాత తాగాలి. దీనివల్ల సులభంగా బరువు తగ్గుతారు.

* 24 గంటల వ్యవధిలో రెండు క్యూబ్స్ డార్క్ చాక్లెట్ తినడం వల్ల శరీరానికి 190 కేలరీలు అందుతాయి. ఇది బరువును తగ్గించడానికి తోడ్పడుతుంది.
* డార్క్ చాక్లెట్ కాఫీ కూడా బరువు తగ్గిస్తుంది. డార్క్ చాక్లెట్ కాఫీ సాయంత్రం సమయంలో తీసుకునే ఉత్తమ పానీయం. రోజంతా ఉండే అలసటను పోగొట్టడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.












Click it and Unblock the Notifications