Cucumber Health benefits: కీరా దోసకాయ వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
బరువు తగ్గాలనుకునే వారికి దోసకాయలు ఓ దివ్యౌషధం. తక్కువ క్యాలరీలు, ఎక్కువ నీటి శాతాన్ని కలిగి ఉంటాయవి. మార్కెట్‌లో తక్కువ ధరకే అందుబాటులో ఉన్న దోసకాయల్లో విటమిన్లు అధికం. విటమిన్ కే, సీ, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు దండిగా ఉంటాయి.
ఈ పోషకాలు శరీర బరువు తగ్గడంలో సహకరిస్తాయి. ఆరోగ్యాన్ని మరింత మెరుగుపర్చగలుగుతాయి. దోసకాయల్లో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల డీహైడ్రేట్ అనే ఇబ్బందే ఉండదు. పచ్చిగా తినడం ఒక్కటే కాకుండా మన వంటకాల్లో కూడా దోసకాయ పోషించే పాత్ర కీలకమే.

దోసకాయ రైత గురించి బహుశా తెలియని వారు ఉండకపోవచ్చు. ప్రతి ఇంట్లో రోజు ఉండే వంటకం ఇది. పెరుగులో ఉల్లిపాయలతో పాటు దోసకాయ ముక్కలను వాడటం అత్యంత సహజం. పెరుగు, జీలకర్ర పొడి, ఉప్పుతో కలిపి తరిగిన దోసకాయల ముక్కలను తినడం వల్ల డీహైడ్రేషన్ పరార్ అవుతుంది.
సలాడ్‌లోనూ కీరా ముక్కలను విస్తృతంగా వాడుతుంటాం. ఉల్లిపాయలు, టమోటా, నిమ్మరసం, కొత్తిమీర, పుదీన మిశ్రమంలో దోసకాయ ముక్కలను కలిపి తినడం వల్ల వచ్చే ఆ మజానే వేరు. మన రోజువారీ ఆహారంలో దోసకాయలను చేర్చడం సహజం.
వాటిని శాండ్‌విచ్‌ల వంటి తేలిక పాటి ఆహారంలో సైతం దోసకాయలకు అధిక ప్రాధాన్యత ఇస్తారనేది తెలిసిన విషయమే. దీన్ని శాండ్‌విచ్ టాపింగ్‌గా ఉపయోగిస్తుంటారు. రోజువారీ ఆహారంలో దోసకాయలను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాల వాటికవే అందుతాయనడంలో సందేహాలు అక్కర్లేదు.
అధిక బరువు, స్థూలకాయ సమస్యలతో ఇబ్బంది పడేవాళ్లు తమ ఆహారంలో దోసకాయను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని డాక్టర్లు చెబుతుంటారు. మార్కెట్‌లో చవగ్గా లభిస్తోండటం వల్ల ప్రతి ఒక్కరి ఫుడ్ మెనూలో ఇది చేరింది. దీన్ని వాడటం వల్ల అటు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఖాయం.












Click it and Unblock the Notifications