రోజూ ఓ అరగంట సైకిల్ తొక్కండి చాలు..!!

నేటి ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ అనేది క్రమంగా తగ్గిపోతోంది. చాలామంది గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేయడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మన దైనందిన అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా వాటన్నింటినీ నివారించుకోవచ్చు. అటువంటి అలవాట్లల్లో ఒకటి.. సైక్లింగ్. శరీరాన్ని ఫిట్‌గా, మెదడు చురుగ్గా, మనస్సును ప్రశాంతంగా ఉంచగల ఓ అద్భుతమైన వ్యాయామం ఇది.

వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సులభంగా చేయగలిగే శారీరక వ్యాయామాలలో సైక్లింగ్ మొదటి స్థానంలో ఉంటుంది. జిమ్‌కు వెళ్లి బరువులు ఎత్తడం లేదా ట్రెడ్ మిల్ పై రన్నింగ్ వంటి కఠినమైన ఎక్సర్ సైజ్ లతో పోలిస్తే.. ఇది వయస్సు పైబడిన వారికీ ఎంతో ఉపయోగకరం. కీళ్లపై ఎలాంటి అదనపు ఒత్తిడిని కలిగించదు. అందువల్ల మోకాళ్ల నొప్పులు ఉన్నవారు కూడా డాక్టర్ల సలహాతో సైక్లింగ్ చేయవచ్చు. ప్రతిరోజూ ఓ అరగంట పాటు సైకిల్ తొక్కడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది.

Discover the Health Benefits of Cycling Heart Lungs Muscles Burn Calories Preserve Lean Muscle

సైక్లింగ్ అనేది ఓ చక్కటి కార్డియోవాస్కులర్ వ్యాయామం. క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల గుండె పనితీరు మెరుగుపడటమే కాకుండా ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా పెరుగుతుంది. రక్తనాళాల్లో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి మంచి కొలెస్ట్రాల్ (HDL) శాతాన్ని పెంచడంలో ఇది సహాయపడుతుంది. ఫలితంగా భవిష్యత్తులో గుండెపోటు, పక్షవాతం వంటి అనారోగ్య సమస్యల ముప్పు గణనీయంగా తగ్గుతుంది.

డేంజరస్ ఫ్లూ బారిన పడ్డ స్టార్ హీరో- సైలెంట్ గా దేశం మొత్తం.. !!
డేంజరస్ ఫ్లూ బారిన పడ్డ స్టార్ హీరో- సైలెంట్ గా దేశం మొత్తం.. !!

తక్కువ కాలంలో ఆరోగ్యకర పద్ధతిలో బరువు తగ్గాలనుకునే వారికి సైక్లింగ్ ఒక వరం లాంటిది. మనం సైకిల్ తొక్కే వేగం, సమయం ఆధారంగా ఇది గంటకు 400 నుండి ఏకంగా 1000 క్యాలరీల వరకు బర్న్ చేయగలదు. శరీరంలో మెటబాలిజం రేటును పెంచడంతో పాటు పొట్ట భాగంలో పేరుకుపోయే మొండి కొవ్వును సైతం సైక్లింగ్ కరిగిస్తుంది. కాళ్లు, తొడలు, పిక్కల కండరాలను దృఢంగా మార్చడంతో పాటు సరైన శరీరాకృతిని పొందడానికి దోహదపడుతుంది.

శారీరక దృఢత్వంతో పాటు మానసిక రక్షణకు కూడా సైక్లింగ్ ఎంతో తోడ్పడుతుంది. సైకిల్ నడుపుతున్నప్పుడు మన మెదడులో ఎండార్ఫిన్లు వంటి హ్యాపీ హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. ఇవి రోజువారీ మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. ఉదయాన్నే కాలుష్యం లేని బహిరంగ ప్రదేశాల్లో సైకిల్ తొక్కడం వల్ల లభించే స్వచ్ఛమైన గాలి మానసిక వికాసానికి ఎంతో మేలు చేస్తుంది.

గరం గరం ఇలాచీ టీ: రెగ్యులర్ చాయ్‌ కు బెస్ట్ ఆల్టర్నేటివ్
గరం గరం ఇలాచీ టీ: రెగ్యులర్ చాయ్‌ కు బెస్ట్ ఆల్టర్నేటివ్

ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిద్రలేమి. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో సైక్లింగ్ చేయడం వల్ల శరీరం తగినంతగా అలసిపోయి, రాత్రి వేళల్లో త్వరగా, గాఢమైన నిద్ర పడుతుంది. ఇది శరీర అంతర్గత లైఫ్ సైకిల్ ను క్రమబద్ధీకరిస్తుంది. అంతేకాకుండా ఆరు బయట సైక్లింగ్ చేయడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డీ లభిస్తుంది. తద్వారా ఎముకల పుష్టితో పాటు వ్యాధి నిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది.

సైక్లింగ్ ప్రారంభించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. సరైన భంగిమలో సైకిల్ సీటును అమర్చుకోకపోతే నడుము లేదా మోకాళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. సైకిల్ తొక్కేటప్పుడు తగినంత నీరు తాగుతూ శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. పర్యావరణానికి ఎటువంటి కాలుష్యం కలిగించని సైక్లింగ్‌ను మన దైనందిన జీవితంలో ఒక అలవాటుగా మార్చుకుంటే, సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మెరుగైన జీవన ప్రమాణాలను అందుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+