ఉదయాన్నే లేవగానే టీ తాగుతున్నారా? అయితే ఇవి తప్పక తెలుసుకోండి!

చాలా మంది ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ముఖం కూడా కదగకుండా బెడ్ టీ లు తాగుతూ ఉంటారు. అది వాళ్లకు ప్రతీరోజూ ఒక అలవాటుగా ఉంటుంది. అయితే ఉదయం ముఖం కూడా కదగకుండా వేడి వేడి పొగలు కక్కే టీ తాగటం మంచిదేనా? అంటే మంచిది కాదని చెప్తున్నారు వైద్య నిపుణులు. ఇలా ప్రతీ రోజూ ఉదయాన్నే టీ తాగటం మన ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని చెప్తున్నారు.

ఖాళీ కడుపుతో టీ అస్సలు తాగకూడదు
ఎవరూ పొరబాటున కూడా ఖాళీ కడుపుతో టీ అస్సలు తాగకూడదు. ఇది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది . ఇలా టీ తాగటం కారణంగా గుండెల్లో మంట, ఎసిడిటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. టీ ఎక్కువగా తాగటం కారణంగా అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. టీ లో కెఫీన్ ఉంటుంది. ఉదయాన్నే లేవగానే టీ తాగితే దానిలో ఉన్న కెఫీన్ ప్రభావం మనపైన కచ్చితంగా ఉంటుంది.

Do you drink tea when you wake up in the morning But you must know these

ఖాళీ కడుపుతో టీ తాగితే వచ్చే సమస్యలివే
ఖాళీ కడుపుతో టీ తాగితే ఇది మన కడుపులోని ఆమ్లాన్ని పెంచుతుంది. అనేక జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది. అయితే ఉదయం నిద్రలేచిన తర్వాత ఒకటి లేదా రెండు గంటల తర్వాత టీ తాగితే దాని వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. అది శరీరానికి ఎలాంటి హాని చేయదు కానీ నిద్ర లేవటంతోనే టీ తో రోజును ప్రారంభిస్తే అది మన శరీరంపై ప్రభావాన్ని చూపిస్తుంది.

టీ ఇలా తాగితే అస్సలు మంచిది కాదు
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల మీ పొట్ట బాగా చెడిపోతుంది. టీ తాగటం మంచిదే కానీ దానికి ఒక సమయం , ఒక పద్ధతి ఉంటుంది. సమయం ప్రకారం , పద్ధతి ప్రకారం టీ తాగితే ఇబ్బంది ఉండదు కానీ అదే పనిగా టీ తాగినా, ఉదయం లేచిన వెంటనే ఒక వ్యసనం మాదిరిగా టీ తాగినా ఇబ్బంది ఉంటుంది.

వేడి టీ తాగటం మానుకోవాలి
అంతే కాదు చాలా వేడి టీ ని కూడా తాగటం మానుకోవాలి. బాగా విపరీతమైన వేడి టీ ఒక వ్యసనంలా తాగితే అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు. కనుక వేడి టీ విషయంలో తస్మాత్ జాగ్రత్త.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+