ఆపిల్ తిన్నవెంటనే నీళ్లు తాగుతున్నారా.. అయితే ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి.
ఆపిల్ - రోజుకు ఒకటి తింటే వైద్యుడి అవసరం ఉండదని అందరికీ తెలిసిన మాట. పోషకాలను పుష్కలంగా కలిగి ఉండే ఈ ఫలం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిల్‌లో ఫైబర్, విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే కారణంగా, శరీరానికి శక్తినిస్తాయి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. కానీ, చాలామంది ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగడం అనుసరిస్తుంటారు. ఈ అలవాటు నిజంగా మంచిదేనా? లేక దానికి వ్యతిరేకంగా ఆరోగ్యానికి ప్రమాదకరమా?
నీరు మన శరీరానికి అత్యవసరమైనది, ఇది జీవక్రియలను సక్రమంగా నిర్వహించడానికి, పోషకాలను రవాణా చేయడానికి , శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడుతుంది. అయితే సాధారణంగా ఫలాలను తిన్న తర్వాత శరీరంలో జీర్ణక్రియ జరగడానికి కొంత సమయం అవసరం. అయితే కొంతమంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆపిల్ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆపిల్ తిన్న వెంటనే చల్లటి నీరు తాగితే ఏమవుతుందో తెలుసుకుందాం..

జీర్ణక్రియపై ప్రభావం
ఆపిల్ తినడం ద్వారా ఉత్పన్నమయ్యే ఆమ్లాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. కానీ వెంటనే నీళ్లు తాగడం వలన ఆ ఆమ్లత తగ్గిపోతుంది. దీంతో ఆహారం సరిగ్గా జీర్ణమవకుండా ఇబ్బందులు తలెత్తవచ్చు. ఫలితంగా ఎసిడిటి, గ్యాస్, ఊబకాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
ఆయుర్వేద అభిప్రాయం
ఆయుర్వేద ప్రకారం, ఫలాలు తినిన వెంటనే నీళ్లు తాగకూడదు. ముఖ్యంగా చల్లటి నీళ్లు అయితే, జీర్ణాగ్ని (digestive fire) మందగిస్తుంది. ఇది 'అజీర్ణం'కు దారి తీస్తుంది. దాంతోపాటు శరీరంలో 'టాక్సిన్స్' పేరుకుపోయే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో ఇది ఇతర ఆరోగ్య సమస్యలకు కారకమవవచ్చు.
ఎప్పుడు నీళ్లు తాగాలి?
ఆపిల్ తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల గ్యాప్ ఇవ్వడం ఉత్తమం. ఇది శరీరానికి తేలికగా జీర్ణక్రియ జరుగేందుకు సహాయపడుతుంది. ఆ తర్వాత తాగిన నీరు శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా, ఆరోగ్యాన్ని మరింత బలంగా చేస్తుంది.
తప్పులు చేయకండి
ఆహార అలవాట్లలో చిన్నచిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలకు దారి తీస్తాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఆపిల్‌ను తినటం మంచిదే కానీ, దాని తిన్న వెంటనే నీళ్లు తాగడం వంటి అలవాట్లతో దాని ప్రయోజనాలు తగ్గిపోతాయి. సబూరుగా, శాస్త్రీయంగా ఆచరించాలి.
అయితే ఆపిల్ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం ఉందా లేదా అనేది వ్యక్తిగత జీర్ణవ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. మీకు సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉంటే, ఆపిల్ తిన్న వెంటనే నీరు తాగడం మానుకోవడం మంచిది. ఒకవేళ మీకు ఎలాంటి సమస్యలు లేకపోతే, కొద్దిగా నీరు తాగడంలో ఎలాంటి అభ్యంతరం లేదు.
ఏది ఏమైనప్పటికీ, ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే, వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.












Click it and Unblock the Notifications