జ్వరం వచ్చినప్పుడు నాన్ వెజ్ తింటున్నారా? అయితే జరిగేదిదే!

చాలామంది జ్వరం వచ్చినప్పుడు నాన్ వెజ్ తినకూడదు అని చెప్తూ ఉంటారు. మరి కొంతమంది జ్వరం వచ్చినప్పుడు చికెన్ తిన్నా ఏమీ కాదని, ఎలాంటి అనుమానాలు లేకుండా చికెన్ తినవచ్చునని చెబుతూ ఉంటారు. అయితే అసలు జ్వరం వచ్చినప్పుడు నాన్ వెజ్ తినొచ్చా? జ్వరంతో బాధపడుతున్న సమయంలో తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలా? వైద్యులు ఏం చెబుతున్నారు? ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

జ్వరం వస్తే నాన్ వెజ్ తినొచ్చా ?
జ్వరంతో బాధపడుతున్న సమయంలో నాన్ వెజ్ ఆహారాల జోలికి వెళ్ళకూడదు. చికెన్, మటన్ వంటి వాటికి దూరంగా ఉండాలని చాలామంది చెబుతూ ఉంటారు, ఇక వైద్యులు కూడా జ్వరం వచ్చిన సమయంలో ఈజీగా డైజెస్ట్ అయ్యే ఆహారాలను మాత్రమే తీసుకోవాలని సూచిస్తారు. సాధారణంగా జ్వరం వచ్చిన సమయంలో మన శరీరంలో ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంది, జీర్ణశక్తి కూడా మందగిస్తుంది.

Do you eat non-veg when you have a fever know the health problems with non veg

నాన్ వెజ్ తింటే ఈ సమస్యలకు ఛాన్స్
అందుకే వైద్యులు నాన్ వెజ్ ఆహారాల కంటే సులభంగా జీర్ణం అయ్యే ఆహారాలను తీసుకోవాలని సూచిస్తారు. ఇక జ్వరం వచ్చిన సమయంలో మాంసాహారాన్ని తీసుకుంటే లివర్ పని తీరు మందగిస్తుంది. దీంతో జాండీస్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే జ్వరం వచ్చిన సమయంలో పచ్చ కామెర్ల సమస్య రాకుండా ఉండడం కోసం మాంసాహారాన్ని తీసుకోకుండా ఉంటేనే మంచిదని వైద్యులు చెబుతారు.

చికెన్ తినొచ్చు కానీ... అలా తింటే ప్రమాదం
మాంసాహారం మాత్రమే కాదు ఆయిల్ తో కూడిన కొన్ని రకాల ఆహారాలను కూడా తీసుకోకూడదు. త్వరగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారాలను తినడం వల్ల అవి త్వరగా జీర్ణమై శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. ఇక నాన్ వెజ్ లో చికెన్ తినడం సురక్షితమే అయినప్పటికీ విపరీతంగా మసాలాలు దట్టించి చేసిన నాన్ వెజ్ కూరలు మంచిది కాదని అవి జ్వరం వచ్చిన సమయంలో ఆరోగ్యానికి మరింత హాని చేస్తాయని చెబుతున్నారు.

ఇలా చికెన్ తింటే పర్లేదు.. కానీ జాగ్రత్త
అయితే ఒకవేళ తినాలి అనుకుంటే చికెన్ ను ఉడికించుకొని సూపు లాగా చేసుకుని తాగితే మంచిది. ఇవి శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. అలా కాకుండా కూరల లాగా వండుకొని తినడం బాగా మసాలాలు వేసి వండుకొని తినడం జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. కనుక జ్వరం వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు నాన్ వెజ్ తినకుండా ఉంటేనే మంచిది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+