బంగాళాదుంపలు తెగ తింటున్నారా? ఆలూ అతిగా తింటే డేంజర్!

చాలామంది బంగాళాదుంపలను ఇష్టంగా తింటారు. బంగాళాదుంపలలో పోషకాలు ఉంటాయని అవి తింటే ఆరోగ్యంగా ఉంటామని భావిస్తారు. అయితే బంగాళదుంప తినడం వల్ల అనేక చెడు ప్రభావాలు కలుగుతాయని చెబుతున్నారు. బంగాళదుంపల్లో ఉండే పోషకాలు అధికంగా తీసుకుంటే మన ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు.

బంగాళాదుంపల్లో ఫుల్ పోషకాలు
బంగాళదుంపలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ b6 వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. ఇక వీటిని అధికంగా తీసుకోవడం చాలా హానికరం. ప్రతిరోజు బంగాళదుంప తినేవారు అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బంగాళదుంపలు ఎక్కువగా తింటే ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు వేధిస్తాయి.

Do you eat potatoes Eating too much of them is dangerous

డయాబెటిస్ ఉన్నవారు బంగాళాదుంపలు తినకుండా ఉంటేనే మంచిది
బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల అవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దోహదం చేస్తాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఇబ్బంది కలిగిస్తుంది. బ్లడ్ షుగర్ ను పెంచుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు బంగాళదుంపలను తినకుండా ఉంటేనే మంచిది. ఇక బంగాళాదుంపలను తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. బంగాళదుంపలలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచుగా తినడం వల్ల బరువు పెరుగుతారు.

బంగాళాదుంపలతో జీర్ణ సమస్యలు
ముఖ్యంగా వేయించిన, చీజ్ ఇతర పదార్థాలతో కలిపి తిన్న బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. కనుక వీటికి దూరంగా ఉంటేనే మంచిది . బంగాళదుంపలను ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ ఏర్పడి తీవ్రంగా ఇబ్బంది పడతారు. బంగాళదుంపలను అధికంగా తీసుకోవడం వల్ల పోషకాల అసమతుల్యత ఏర్పడుతుంది.

బంగాళాదుంపలతో రక్తపోటు ప్రమాదం
బంగాళదుంపలలో కొన్ని విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వీటిలో మన శరీరానికి కావలసిన ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు లేవు కనుక ఎక్కువగా తింటే అనారోగ్యమే .
ఇక ముఖ్యంగా బంగాళదుంపలను వేయించి తినడం, చిప్స్ తినడం ఏ మాత్రం మంచిది కాదు. ఇవి అధిక రక్తపోటుకు కారణం అవుతాయి. ముఖ్యంగా వేయించిన బంగాళదుంపలను తినడం చాలా ప్రమాదాలకు కారణం అవుతుంది.

వీరు బంగాళాదుంపలకు దూరం ఉంటేనే బెస్ట్
కాబట్టి బంగాళదుంపలను ఎక్కువగా తినేవారు కాస్త తగ్గించుకుంటే మంచిది. డయాబెటిస్, బిపి వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు వాటిని పూర్తిగా తినకుండా ఉంటేనే మంచిది. కీళ్ళ నొప్పులు వంటి సమస్యలు ఉన్నవారు కూడా బంగాళాదుంపలకు దూరంగా ఉండాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+