హై బీపీ ఉందా? ఈ ఆహారాలు అసలే తినొద్దు!
ప్రస్తుత సమాజంలో చాలా మంది హైబీపీతో బాధపడుతున్నారు. హై బిపి తో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుంది. ఎవరైతే అధిక రక్తపోటు బారిన పడతారో వారు అనేక ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. హై బీపీ ఉంటే ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావం పడుతుంది. అందుకే ఎప్పుడూ బిపి అదుపులో ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజు కచ్చితంగా టాబ్లెట్ వేసుకోవాలి.
హైబీపీ ఉన్నవారు తీసుకోకూడని ఆహారాలు
బీపీ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా హై బీపీ ఉన్నవారు ఆహారం విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల బీపీ పెరిగిపోతుంది .ఇక అటువంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. హై బీపీ ఉన్నవారు ఐదు రకాల ఆహారాలు తీసుకోకూడదు. ఆ ఆహారాలు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

అధిక రక్తపోటుతో ఇవి తినకండి
హై బీపీ ఉన్నవారు మటన్, బీఫ్, రెడ్ మీ వంటి ఆహారాలను ఎక్కువగా తినకూడదు. వీటిని తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువవుతుంది. బీపీ పెరగడంతో పాటు గుండెకు అనవసరమైన రిస్కు వచ్చి పడుతుంది. హైబీపీ ఉన్నవాళ్లు ఆహారంలో పచ్చళ్లను ఎక్కువగా తినకూడదు. పచ్చళ్ళు నిల్వ ఉండేందుకు ఉప్పును అధికంగా ఉపయోగిస్తారు. ఇక నిలువ పచ్చళ్ళు తింటే అందులో ఉండే సోడియం కారణంగా బీపీ పెరిగి ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఇవి తింటే రక్తపోటు పెరుగుతుంది
హైబీపీ ఉన్నవారు ఆహారాలలో ముఖ్యంగా ఉప్పును అధికంగా తీసుకోకూడదు. ఉప్పును చాలా తక్కువగా వాడాలి. ఉప్పు బ్లడ్ ప్రెషర్ ను పెంచుతుంది. అందుకే సాల్ట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ను హై బీపీ ఉన్నవాళ్లు తినకూడదు. ఇక హై బీపీ తో బాధపడేవారు తీపి పదార్థాలను తినకూడదు. ప్రాసెస్ చేసిన ఆహారాలను తినకూడదు.
వీటికి బీపీ పేషెంట్స్ దూరంగా ఉండాలి
డీప్ ఫ్రై చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోకూడదు. వీటిలోనూ బ్లడ్ ప్రెషర్ ను పెంచే కారకాలు ఉంటాయి. వీటి వల్ల కూడా కొవ్వు పెరిగే అవకాశం ఉంటుంది. హైబీపీతో బాధపడేవారు ఆల్కహాల్ తీసుకోకూడదు. దీనివల్ల శరీరంలో బ్లడ్ ప్రెషర్ అమాంతం పెరిగే సమస్య వస్తుంది. హై బీపీ ఉన్నవాళ్లు ఆల్కహాల్ అలవాటు ఉంటే మానేస్తే మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications