విపరీతమైన నడుం నొప్పి వెనుక బోలెడు కారణాలు మీకు తెలుసా?

నడుము నొప్పి.. చాలామంది ప్రస్తుత సమాజంలో నడుము నొప్పితో బాధపడుతున్నారు. నడుము నొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. నడునొప్పి అంటే దిగువ వెన్నునొప్పి.. ఇది నడుము భాగంలో పిరుదులకు పైన కటి ప్రాంతంలో వచ్చేటువంటి నొప్పి. ప్రధానంగా ఇది శారీరక శ్రమ లేకుండా ఎక్కువ గంటలు కూర్చోవడం వంటి చర్యల వల్ల వస్తుంది.

నడుం నొప్పి.. ఒక ప్రధాన సమస్య
ముఖ్యంగా పదవి విరమణ చేసిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు వృద్ధాప్యంలో ఉన్న వారికే వచ్చే నడుం నొప్పి ఇప్పుడు యుక్త వయసులో ఉన్న వారికి కూడా వస్తుంది. ఈ నొప్పి ఒక్కొక్కసారి తక్కువగాను ఒక్కొక్కసారి భరించలేనిదిగాను ఉంటుంది. ఎక్కువసేపు కూర్చునే వారిలో నడుము నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. కూర్చునే భంగిమ సరిగ్గా లేనప్పుడు నడుం నొప్పి బాధిస్తుంది.

Do you know the many reasons behind severe lower back pain

సయాటికా నొప్పి
తీవ్రమైన నడుం నొప్పి సయాటికా నొప్పిగా మారుతుంది. ఇది నడుము, కాళ్లు మరియు తొడల వరకు, నడుము క్రింది నుంచి నొప్పి కలుగుతుంది. దీనివల్ల నడుము నుంచి కాళ్లల్లోకి, తొడలలోకి ఉండే నరాలు విపరీతమైన బాధను కలిగిస్తాయి. ఇక ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వారిలో కూడా నడుము నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

నడుం నొప్పికి ఎన్నో కారణాలు
వెన్నుపూసల మధ్య ఉండే డిస్కులు పక్కకు జరిగినా, వెన్నుముక లోపల ఖాళీలు తగ్గినా పక్కన ఉండే నరాలపై ఒత్తిడి పడి స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ అనే సమస్య వస్తుంది. దీని వల్ల కూడా విపరీతంగా నడుం నొప్పి బాధిస్తుంది. కండరాల మితిమీరిన వినియోగం వలన, వెన్నుపూస కుదింపు, పగుళ్లు వంటి వాటి వలన కూడా నడునొప్పి వస్తుంది.

నిద్రలేమి, స్మోకింగ్ కూడా నడుం నొప్పికి కారణాలు
అంతేకాదు నిద్రలేమి సమస్య కూడా నడుము నొప్పికి కారణం. నిద్రలేని వారిలో నడుము నొప్పి వచ్చే అవకాశం 1.5 రెట్లు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడించాయి. ఇక నడిచే తీరు సరిగా లేకపోయినా నడుము నొప్పి వస్తుంది. స్మోకింగ్ చేసేవారిలో నడుము నొప్పి సమస్య వచ్చే అవకాశం ఉంటుందని అనేక అధ్యయనాలలో తేలింది. స్మోకింగ్ చేసేవారిలో వెన్నుపూసల మధ్య ఉండే గట్టి రబ్బరు లాంటి డిస్కులు క్షీణిస్తాయి.

హైట్, టైట్ ప్యాంట్ల వలన కూడా నడుం నొప్పి
ఒక్కొక్కసారి హైట్ కూడా నడుము నొప్పికి దారితీస్తుంది. పొట్టి వాళ్ళతో కంపేర్ చేస్తే ఎత్తు ఎక్కువగా ఉన్నవారిలో నడుము నొప్పి వచ్చే అవకాశాలు 20% ఎక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి. టైట్ ప్యాంట్లు ధరించడం వల్ల నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. టైట్ ప్యాంట్లు వలన నడుం కింది భాగంలో ఒత్తిడి పెరుగుతుందని ఫలితంగా నడుము నొప్పి వస్తుంది.

ఈ పని చేసినా నడుం నొప్పి పక్కా
చాలామంది మగవాళ్ళు ప్యాంట్లకు వెనుక ఉన్న జేబులలో పర్సులు పెడుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళు కూర్చునే భంగిమలో మార్పు వస్తుంది. అలా బ్యాక్ పాకెట్లో పర్సును పెట్టడం వల్ల నడుం క్రింది భాగంలో ఉన్న కండరాలపై ఒత్తిడి పెరిగి నడుమునొప్పి వస్తుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+