ఒత్తైన జుట్టు కావాలా ? హెయిర్ ఫాల్ కి చెక్ పెట్టాలా ?.. అయితే ఈ టిప్స్ మీకే !
మారుతున్న కాలానుగుణంగా వాతావరణం కూడా మారుతోంది. దీంతో ఈరోజుల్లో ఎక్కువగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న ప్రాబ్లం జుట్టు రాలడం. హెయిర్ ఫాల్ సమస్యకి చెక్ పెట్టడానికి మన జుట్టు ఆరోగ్యంగా, అందంగా కనిపించేలా ఉండడానికి హెయిర్ కేర్ పాటించడం చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనకు అందుబాటులో ఉండే వస్తువుల తోనే.. నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు.
అంతే కాకుండా జుట్టు రాలే సమస్యకు పెద్దగా డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేకుండా.. ఆహారపు అలవాట్లతో కూడా చెక్ పెట్టడానికి కొన్ని టిప్స్ సూచిస్తున్నారు. ఆహారంలో క్రమం తప్పకుండా ఈ ఫ్రూట్స్ తింటే జుట్టు రాలడం , బట్టతల సమస్యను అధిగమించవచ్చు అని చెబుతున్నారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా...

హెయిర్ ఫాల్ తగ్గించడానికి, జుట్టు ధృడంగా ఉండడానికి ఉపయోగపడే ఫ్రూట్స్..
ఆపిల్..
రోజుకు ఒక ఆపిల్ తింటే వైద్యుడిని దూరంగా ఉండవచ్చు అనే మాట అందరికీ తెలిసిందే. ఆపిల్ తినడం వల్ల వచ్చే జుట్టు మరింత బలంగా మారుతుందని.. హెయిర్ ఫాల్ తగ్గుతుందని అంటున్నారు.
బొప్పాయి..
జుట్టు పెరుగుదలకు ముఖ్యమైన కొల్లాజెన్ బొప్పాయిలో పుష్కలంగా లభిస్తుంది. అలానే బొప్పాయిలో ఉండే అమైనో ఆమ్లాలు , విటమిన్ సి జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయని సూచిస్తున్నారు.
జామ..
విటమిన్ సి ఎక్కువగా ఉండే జామ పండ్లు తినడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది. అంతే కాకుండా ఇది జుట్టు రాలడాన్ని నివారించడంలో, కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో ఇది చాలాముఖ్య పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు.
నారింజ..
నారింజలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. అంతే కాకుండా జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయని అంటున్నారు. విటమిన్ బి12, విటమిన్ ఇ కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని అంటున్నారు.
కివీ..
కివీలో విటమిన్ సి, ఎ, కె, ఇ, లుటిన్, యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, మెగ్నీషియం , భాస్వరం రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టును బలంగా, మందంగా, అందంగా మారుస్తాయి.
అంతే కాకుండా మనకు అందుబాటులో ఉండే వస్తువుల తోనే.. నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. రక్త ప్రసరణను పెంచడానికి, జుట్టు కుదుళ్లకు పోషణ అందించడానికి, కొబ్బరి నూనెతో వారానికి ఒకసారి తలకు మసాజ్ చేయడం ముఖ్యమని సూచిస్తున్నారు. వేసవి కాలంలో జోజోబా ఆయిల్, చలికాలంలో ఆలివ్ ఆయిల్ జుట్టుకు అనుకూలంగా ఉంటాయని చెబుతున్నారు. ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుందని వివరిస్తున్నారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications