మంచినీటికి ఎక్స్ పైరీ డేట్ ఉంటుందా?
ప్రస్తుతం అన్నీ కలుషితమైపోయిన సమాజంలో మనం నివసిస్తున్నాం
నిత్య జీవితంలో నీటికి ఉన్న ప్రాధాన్యత దేనికీ ఉండదు. అందుకే ఇది పంచభూతాల్లో ఒకటైంది. నీటికి సంబంధించి ప్రతిరోజు మనం చాలావార్తలు తెలుసుకుంటూనే ఉంటాం. గుక్కెడు నీటికోసం ఎదురుచూసే ప్రాంతాలు మనదేశంలో ఇప్పటికీ ఉన్నాయి. అంతేకాదు.. కిలోమీటర్ల తరబడి నడిచివెళ్లి బిందెడు నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. దుర్వినియోగమయ్యేచోట నీరు వృథాగా పోతూనే ఉంటుంది. అయితే ఒకే ఒక ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడంలేదు. అదేమిటంటే.. మంచినీటికి గడువు తేదీ ఎక్స్ పైరీ డేట్ ఉంటుందా? ఉంటే ఎన్నిరోజులు? మంచినీరు చెడిపోవడానికి కారణం ఏమిటి? తెలుసుకుందాం.
ప్రస్తుతం అన్నీ కలుషితమైపోయిన సమాజంలో మనం నివసిస్తున్నాం. దీంతో నాణ్యమైన వస్తువుల కోసం మానవుడు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అందులో భాగంగానే మంచినీటిని కూడా కొనుగోలు చేసి తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చూసినా మంచినీటి సీసాల విక్రయాలు విపరీతంగా జరుగుతుంటాయి. ఆ విక్రయాలు పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకాయి. మంచినీటి సీసా కొనుగోలు చేసినప్పుడు దానిపై గడువు తేదీ రాసి ఉంటుంది. నీటికి ఎక్స్ పైరీ డేట్ లేకపోతే మంచినీళ్ల సీసాలపై ఎందుకు డేట్ వేస్తున్నారనే ప్రశ్న అందరినీ వేధించేది. దీనికి కారణం ఏమిటంటే..

మంచినీటి సీసాలపై రాసివున్న గడువు తేదీ నీటిది కాదని, మంచినీటి సీసాలదేనని నిపుణులు చెబుతున్నారు. నీటి సీసాలు ప్లాస్టిక్ తో తయారుచేయబడతాయి కాబట్టి నిర్ధిష్ట సమయం తర్వాత ప్లాస్టిక్ నెమ్మదిగా నీటిలో కరగడం ప్రారంభిస్తుంది. మంచినీటి సీసాలపై గడువు తేదీ రాసివుండటానికి ఇదే ప్రధాన కారణం.
ఇప్పుడు నీటికి గడువు తేదీ ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనికి ఎవరి దగ్గరా సమాధానం లేదు! అనేక ప్రక్రియద్వారా నీటిని శుద్ధి చేస్తారు. నీటిని ఎక్కువ సమయం ఒకే చోట ఉంచితే తాగేముందు తప్పనిసరిగా శుభ్రం చేయాలని పేర్కొన్నారు. వాస్తవానికి మంచినీటికి గడువుతేదీ ఉండదు.












Click it and Unblock the Notifications