పోనీటెయిల్ హెయిర్‌స్టైల్స్‌తో జుట్టు రాలుతుందా.. ? పరిష్కారం ఎలా.?

పోనీటెయిల్ లాంటి బిగువైన హెయిర్‌స్టైల్స్ సాధారణంగా చాలా మందికి ఇష్టమైనవి. అయితే, ఈ తరహా స్టైలింగ్ వల్ల జుట్టు ఆరోగ్యం ప్రభావితమవుతుందా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. పోనీటెయిల్ తరచుగా ధరించడం వల్ల కొన్ని సందర్భాల్లో జుట్టు ఊడే సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ట్రాక్షన్ అలొపీసియా (Traction Alopecia) అనే సమస్య వచ్చే అవకాశం ఉంది. అయితే కొన్ని నియమాలు పాటిస్తే ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు.

ట్రాక్షన్ అలొపీసియా అంటే ఏమిటి?
పోనీటెయిల్ వల్ల ముఖ్యంగా నుదురు పైభాగంలో, ముందు భాగంలో పక్కలకు జుట్టు పలచబడటం కనిపిస్తుంది. దీన్నే పోనీటెయిల్ అలొపీషియా అంటారు. ట్రాక్షన్ అలొపీసియా అనేది జుట్టు వేర్లపై ఎక్కువ ఒత్తిడి పడటం వల్ల కలిగే జుట్టు ఊడే సమస్య. ఇది తరచూ బిగువైన పోనీటెయిల్, బ్రేడ్స్, లేదా ఇతర స్టైల్స్ వల్ల ఏర్పడుతుంది. ఎక్కువగా ఈ తరహా ఒత్తిడి కారణంగా జుట్టు వేర్లు బలహీనమవుతాయి. జుట్టు ఒత్తు తగ్గుతుంది. కొంతమంది వ్యక్తుల్లో శాశ్వత జుట్టు కోల్పోవడం కూడా జరుగుతుంది.

Does Your Ponytail Pose a Risk to Your Hair s Health

పోనీటెయిల్ వల్ల సమస్యలు ఎలా వస్తాయి?
పోనీటెయిల్ చాలా బిగువుగా కట్టడం వల్ల, జుట్టు వేర్ల మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. రోజు రోజుకు అదే తరహా స్టైలింగ్ చేయడం వల్ల జుట్టు తెగిపోవడం, వేర్లు బలహీనపడడం జరుగుతుంది. బిగువైన రబ్బర్ల వల్ల జుట్టు దెబ్బ తినడమే కాకుండా, వాటి కుదుళ్ల మీద ఉన్న న్యాచురల్ ఆయిల్స్ కూడా నష్టపోతాయి. జుట్టు పొడిగా మారి చుండ్రు సమస్య వస్తుంది.

ఎలా నివారించాలి?
రోజుకు 8 గంటల కంటే ఎక్కువ సమయం బిగువుగా పోనీటెయిల్ ధరించకూడదు. దీనిని చిట్‌కాయ స్టైల్ అని కూడా అంటారు. సాఫ్ట్ రబ్బర్లు, హెయిర్ బాండ్లు ఉపయోగించాలి. రోజుకు లేదా వారానికి కొన్ని రోజుల పాటు జుట్టును స్వేచ్ఛగా ఉంచడం మేలు చేస్తుంది. అదే విధంగా వివిధ హెయిర్ స్టైల్స్ ప్రయత్నించడం ద్వారా జుట్టు వేర్లపై ఒత్తిడి తగ్గించవచ్చు.

బలమైన జుట్టు కోసం చిట్కాలు
జింక్, బయోటిన్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా జుట్టు బలంగా మారుతుంది. నెలకు ఒక్కసారి ఆయిల్ మసాజ్ చేసుకోవాలి. ఇది జుట్టు వేర్లకు పోషణ అందించి బలహీనతను నివారిస్తుంది. జుట్టు విపరీతంగా ఊడుతున్నట్లయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

పోనీటెయిల్ , ఇతర హెయిర్‌స్టైల్స్ ధరించడం వల్ల సమస్యలు వస్తే, జుట్టు ఆరోగ్యం మీద సరైన దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. సరైన జాగ్రత్తలు తీసుకుంటే, మీ జుట్టు బలంగా ఉండటమే కాకుండా, అందంగా కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+