హెల్మెట్ పెడితే జుట్టు రాలుతుందా? బట్టతల వస్తుందన్న భయంలో నిజమెంత?

బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం ప్రాణరక్షణకు ఎంతో అవసరం. అయితే చాలా మంది వాహనదారులు హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందని.. త్వరగా బట్టతల వస్తుందని భయపడుతుంటారు. ఆ భయంతో హెల్మెట్ ధరించకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరి హెల్మెట్‌కు, జుట్టు రాలడానికి నిజంగానే సంబంధం ఉందా? నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

హెల్మెట్ ధరించడం వల్ల నేరుగా జుట్టు రాలదు. కానీ హెల్మెట్‌ను వాడే పద్ధతి సరిగ్గా లేకపోతే మాత్రం జుట్టుకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెల్మెట్ వల్ల జుట్టు రాలడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Does Wearing a Helmet Cause Hair Fall Truth Behind the Baldness Myth

1. ట్రాక్షన్ అలోపేసియా
మీరు వాడే హెల్మెట్ మరీ బిగుతుగా ఉంటే అది జుట్టు కుదుళ్లను నిరంతరం వెనుకకు లాగుతుంది. అలా పదేపదే జుట్టుపై ఒత్తిడి పడటం వల్ల కుదుళ్లు బలహీనపడి జుట్టు రాలడం మొదలవుతుంది. దీనినే వైద్య పరిభాషలో 'ట్రాక్షన్ అలోపేసియా' అంటారు.

2. చెమట, ఇన్‌ఫెక్షన్లు
హెల్మెట్ పెట్టుకున్నప్పుడు తలకు గాలి సరిగ్గా ఆడదు. దీనివల్ల లోపల చెమట పడుతుంది. హెల్మెట్ లోపల ఉండే ప్యాడింగ్ మురికిగా ఉంటే, ఆ చెమట వల్ల బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇది జుట్టు కుదుళ్లను దెబ్బతీసి జుట్టు రాలడానికి కారణమవుతుంది.

జుట్టు రాలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
హెల్మెట్ ధరిస్తూనే మీ జుట్టును సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి:

*కాటన్ స్కార్ఫ్ వాడండి: హెల్మెట్ పెట్టుకునే ముందు తలకు ఒక కాటన్ స్కార్ఫ్ లేదా రుమాలు కట్టుకోండి. ఇది చెమటను పీల్చుకోవడమే కాకుండా, హెల్మెట్‌కు జుట్టుకు మధ్య ఘర్షణను తగ్గిస్తుంది.

*హెల్మెట్ శుభ్రత: హెల్మెట్ లోపలి ప్యాడింగ్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. వీలైతే వాష్ చేయగలిగే ప్యాడింగ్ ఉన్న హెల్మెట్లను ఎంచుకోండి.

*తడి జుట్టుతో వద్దు: స్నానం చేసిన వెంటనే జుట్టు తడిగా ఉన్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవద్దు. తడి వల్ల ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తాయి.

*సరైన సైజు: మరీ టైట్‌గా కాకుండా.. కరెక్ట్ సైజులో ఉన్న హెల్మెట్‌ను ఎంచుకోండి.

*సొంత హెల్మెట్: వీలైనంత వరకు వేరొకరు వాడిన హెల్మెట్ వాడకపోవడమే మంచిది. దీనివల్ల ఒకరి తలలోని ఇన్‌ఫెక్షన్లు మరొకరికి సోకవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+