మామిడిపండు తిన్న తర్వాత ఇవి తినొద్దు, ఈ పనులు అసలే చెయ్యొద్దు!
సమ్మర్ సీజన్లో అందరికీ ఇష్టమయ్యే పండ్ల రారాజు మామిడిపండు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చింది. మామిడి పండ్లను చూస్తే ఎవరికైనా నోరూరుతుంది. మామిడి పండ్లు తినాలని అనుకోని వారు ఎవరు ఉండరు. మామిడిపండు రుచికి మాత్రమే కాదు, బోలెడన్ని పోషకాలతో మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. మామిడి పండ్లలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఏ, ఫైబర్, ఆంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
మామిడి పండ్లు తింటున్నారా?
అంతేకాదు మన జీర్ణక్రియను మెరుగుపరిచే, పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ఎంజైములు కూడా మామిడి పండ్లలో పుష్కలంగా ఉంటాయి. ఇక అటువంటి మామిడి పండ్లను తింటున్న వారు మామిడి పండ్లు తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తినకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ పొరపాటున తింటే అనవసరమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

మామిడి పండ్లు తిన్నాక ఇవి అసలే తినొద్దు
మామిడిపండు తిన్న తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలను తినకూడదు. మామిడి పండ్లతో పాల పదార్థాలను తీసుకోకుండా ఉంటేనే మంచిది. పాలు, పెరుగు, మజ్జిగ, శీతల పానీయాలు, మామిడి స్మూతీలు వంటివి తీసుకోకూడదు. మామిడి పండ్లను తిన్న తర్వాత వీటిని తీసుకుంటే జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. ఇవి జీర్ణక్రియను నిదానింపజేసి జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమవుతాయి. ఇక మామిడి పండ్లను తినేవారు మామిడి పండ్లతో చీజ్ తినడం మంచిది కాదు.
మామిడి పండు తిన్న తర్వాత ఇవి చేస్తే అనారోగ్య సమస్యలు
మామిడిపండు తిన్న తర్వాత బాగా వేడిగా ఉండే ఆహారాన్ని కానీ మసాలాతో చేసిన ఆహారాన్ని కానీ తినకూడదు. మామిడిపండు తిన్న తర్వాత మళ్లీ ఇతర పండ్లను తినడం వల్ల జీర్ణ సమస్యలు గ్యాస్ లేదా అజీర్ణ సమస్యలు వస్తాయి. ఇక మామిడిపండు తిన్న తర్వాత వెంటనే నిద్రపోతే కూడా జీర్ణక్రియలో ఇబ్బందులు వస్తాయి. తిన్న తర్వాత నిద్రకు ముందు ఒక అరగంట సమయమైనా గ్యాప్ ఉండాలి.
మామిడి పండు తిన్నాక అనారోగ్య బారిన పడకుండా ఇవి చెయ్యండి
ఇక మామిడిపండు తిన్న తర్వాత 30 నిమిషాల నుండి ఒక గంట వరకు కొన్ని పనులు చేయకుండా ఉంటేనే మంచిది. మామిడి పండు తిన్న తర్వాత బరువులు ఎత్తడం, శారీరక వ్యాయామాలు చేయడం వంటిది మంచిది కాదు. ఇక మామిడి పండు తినాలి అనుకునేవారు చేయకూడని పనులు, మామిడి పండు తిన్న తర్వాత తినకూడని పదార్థాలను ఖచ్చితంగా తెలుసుకుంటే అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
disclaimer: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications