గ్రీన్ టీ తాగటం మంచిదే కానీ వీళ్ళకు మాత్రం డేంజర్!

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ప్రస్తుతం చాలామంది ఆరోగ్యం పైన దృష్టి సారిస్తున్నారు. ఫిట్ గా ఉండడం కోసం, బరువు తగ్గడం కోసం పాలతో చేసిన టీ ని తాగడానికి బదులు గ్రీన్ టీ ని అలవాటు చేసుకుంటున్నారు. గ్రీన్ టీ తో ఆరోగ్యం ఉంటుందని నమ్ముతున్నారు. వాస్తవానికి గ్రీన్ టీ తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ గ్రీన్ టీని కూడా ఎక్కువగా తాగడం మంచిది కాదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

గ్రీన్ టీ తో ఆరోగ్యం
ముఖ్యంగా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గ్రీన్ టీ తాగడం మంచిది కాదని చెబుతున్నారు. గ్రీన్ టీ తాగితే బరువు తగ్గుతుందని చాలామంది భావిస్తున్నారు. అందుకే వారు ఈజీగా బరువు తగ్గడానికి గ్రీన్ టీ ని అద్భుతమైన పానీయంగా పరిగణించి నిత్యం సేవిస్తున్నారు. బయట మార్కెట్ లో గ్రీన్ టీ విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి.

Drinking green tea is good but it is dangerous for liver diseased patients

గ్రీన్ టీ ఎక్కువ తాగితే ఈ ప్రమాదం
గ్రీన్ టీ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని, డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుందని, ఇది శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుందని భావిస్తున్నారు. అయితే ఎన్నో మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని గ్రీన్ టీ ని విపరీతంగా తాగితే దానివల్ల కాలేయ సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.

వీరు గ్రీన్ టీ తాగటం హానికరం
గ్రీన్ టీ లో ఉండే కాటెచిన్స్ ముఖ్యంగా ఎపిగల్లో కాటెచిన్ గాలెట్ మన కాలేయాన్ని ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి గ్రీన్ టీ తాగటం చాలా హానికరమని, వీరు పొరపాటున కూడా దీనిని తాగకూడదని చెబుతున్నారు. అయితే శరీరంలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీ ని తాగాలి అనుకుంటే వైద్యుడిని సంప్రదించిన తర్వాతనే తాగాలని చెప్తున్నారు.

బరువు తగ్గాలని గ్రీన్ టీ ఎక్కువ తాగితే అనర్ధం
లేదంటే అది ఆరోగ్యం పైన చెడు ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు. ఇక బరువు తగ్గడానికి గ్రీన్ టీ తాగేవారు అతిగా తాగితే అనర్థం జరుగుతుందని, బరువు తగ్గడం కోసం రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ మాత్రమే తాగాలని చెప్తున్నారు. బరువును కూడా నిదానంగానే తగ్గాలని చెబుతున్నారు .ఇంతకంటే ఎక్కువ కప్పులు గ్రీన్ టీ తాగితే కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

ఏదైనా మితంగానే
ముఖ్యంగా ఆరోగ్యం కోసం చేసే డైట్ అయినా, తీసుకునే పానీయాలైనా, చేసే వ్యాయామమైనా పరిమితికి మించి చేస్తే కచ్చితంగా దాని దుష్ప్రభావాలు మన శరీరం పైన ఉంటాయని జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. మంచి చేసేదైనా మితంగానే తీసుకోవాలని అంటున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+