Milk Benefits: పాలు తాగితే బరువు తగ్గుతారా..!
పాలు తాగితే బరువు తగ్గుతారా లేక పెరుగుతారో తెలుసుకుందాం..
పాలు తాగితే మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు. పాలలో ఆకలి కోరికలను తగ్గించే పెప్టైడ్ వైవై అని పిలువబడే హార్మోన్ ఉంటుందట. బరువు పెరుగుతామని కొందరు పాలు తాగరు. కానీ నిజానికి బరువు తగ్గడానికి పాలు ఎంతో ఉపయోగపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వాళ్లు బరువు పెరగడానికి దారితీసే నిర్దిష్ట ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

కాల్షియం
పాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ జరిపిన అధ్యయనం ప్రకారం.. పాలు, పాల ఉత్పత్తులు బరువు తగ్గడానికి ఎఫెక్టీవ్ గా ఉపయోగపడతాయని పేర్కొంది. పాలలో పోషకవిలువలు ఎక్కువ మొత్తంలో ఉంటాయట. పాలు, అరటి స్మూతీ లో ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మిమ్మల్ని ఎక్కువ సేపు సంతృప్తిగా ఉంచడానికి ఉపయోగపడతాయి. తద్వారా మీరు ఆహారం తక్కువగా తీసుకుని బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

మెగ్నీషియం, జింక్
పాలల్లో ఉండే కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది. అందుకే పిల్లలు ఎక్కువగా పాలు తాగాలని వైద్యులు సూచిస్తారు. పాలలో విటమిన్ బి 12, మెగ్నీషియం, జింక్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ ప్రోటీన్, కాల్షియంతో పాటుగా మీరు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. గోరు వెచ్చని పాలను తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

పాలలో తేనె
పాలలో తేనె లేదా పసుపును కలిపి తాగినా మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. వీటిని పాలలో వేసుకుని తాగడం వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది. ఆవు పాలతో పోల్చుకుంటే.. గేదె పాలలో ఎక్కువగా ఉంటుంది. అందుకనే గేదె పాలు చిక్కగా ఉంటాయి. ఆవు పాలలో 3 నుండి 4 శాతం కొవ్వు ఉంటే.. గేదె పాలలో 7 నుంచి 8 శాతం కొవ్వు ఉంటుందట.












Click it and Unblock the Notifications