మిమ్మల్ని త్వరగా వృద్ధులను చేసే ఈ డ్రింక్స్ త్రాగుతున్నారా?
వృద్ధాప్యం అనేది ఒక సహజమైన ప్రక్రియ. కానీ మనం తీసుకునే ఆహారం ఒక్కొక్కసారి మన వయస్సును పెంచి మనల్ని ముసలి వాళ్ళను అయ్యేలా చేస్తుంది. అదేంటి ఆహారంతో కూడా వయసు పెరుగుతుందా అంటే కచ్చితంగా అవును అని చెప్పొచ్చు . కొన్ని రకాల ఆహార పదార్థాలు తిం,టే కొన్ని రకాల పానీయాలు తాగితే కచ్చితంగా మీరు మీ కంటే పదేళ్లు ఎక్కువ వయసున్న వారిలాగా కనిపిస్తారు.
ముసలితనం రాకుండా ఉండాలంటే ఇవి ఎక్కువ తాగొద్దు
మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, యవ్వనంగా కనిపించడానికి తాగకూడని కొన్ని పానీయాలను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. చాలామంది కాఫీ ని ఎక్కువగా తాగుతూ ఉంటారు. మార్నింగ్ సమయంలో కప్పు కాఫీ తాగితే పరవాలేదు కానీ రోజంతా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువ కాఫీని తాగుతూ ఉంటారు. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల ఇది మూత్ర విసర్జనను ఎక్కువ చేస్తుంది ఫలితంగా డీహైడ్రేషన్ తో మన చర్మం పాడవుతుంది.

వీటిని ఎక్కువ తాగుతున్నారా.. అయితే వృద్ధాప్యం ఖాయం
కాఫీ ఎక్కువ తాగితే మన చర్మం సాధారణ వయసు కంటే ముందే ముడతలు పడి నిర్జీవంగా కనిపిస్తుంది. ఫలితంగా మన సాధారణ వయసు కంటే పదేళ్లు పెద్దగా మనం కనిపిస్తాము. చాలామంది ఆల్కహాల్ ను తీసుకుంటారు. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో చర్మం డిహైడ్రేట్ అవుతుంది. ఫలితంగా తక్కువ వయసులోనే చర్మం యవ్వన రూపాన్ని కోల్పోయి వృద్ధాప్యం వచ్చినట్లుగా కనిపిస్తుంది.
ఇవి తాగితే చర్మం ముడతలు... ముసలితనం
కనుక ఆల్కహాల్ తీసుకునేవారు ఆల్కహాల్ వినియోగాన్ని మానేస్తే మంచిది. లేదా బాగా తగ్గిస్తే మంచిది. లేదంటే తక్కువ వయసులోనే ఎక్కువ ముసలివారి లాగా కనిపిస్తారు. చాలామంది కూల్ డ్రింక్స్ ను ఎక్కువగా తాగుతూ ఉంటారు. కూల్ డ్రింక్స్ తాగడం మంచిది కాదు. కూల్ డ్రింక్స్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది చర్మంలోని కొలాజిన్, ఎలాస్టిక్ ను దెబ్బతీస్తుంది. ఫలితంగా చర్మం ముడతలు పడి ముసలివారిలా కనిపిస్తారు.
యంగ్ గా కనిపించాలంటే ఇవి తాగండి
కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది. ఎవరైతే యవ్వనంగా, చర్మం ముడతలు లేకుండా కనిపించాలి అని అనుకుంటారో వారు పండ్ల రసాలు, క్యారెట్, బీట్రూట్ వంటి కూరగాయల జ్యూస్ తాగడం మంచిది. ఫ్రూట్ జ్యూసులు తాగితే చాలా యంగ్ గా కనిపిస్తారు. సినీ నటులు, తారలు ఎక్కువగా ఫ్రూట్ జ్యూస్ లనే తాగడానికి ఇష్టపడతారు. అందుకే వారు ఎంత పెద్ద వయసు వచ్చినప్పటికీ మన కంటే యంగ్ గా కనిపిస్తున్నారు. కనుక కాఫీలు, టీలు, కూల్ డ్రింక్స్, ఆల్కాహాల్ కు గుడ్ బై చెప్పి ఆరోగ్యంగా, యంగ్ గా కనిపించండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
మటన్ బోన్ సూప్.. హెల్దీగా, యంగ్ గా కనిపించాలంటే ఇలా చెయ్యండి! -
గుడ్డులో పచ్చ సొన ఎవరికి మంచిది, ఎవరికి డేంజర్..!! -
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్











Click it and Unblock the Notifications