మునగాకు మహత్యం తెలుపతరమా!
ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. అయితే ఆరోగ్యంగా ఉండడం కోసం ఆరోగ్యాన్ని ఇచ్చే కొన్ని ఆకుల గురించి మాత్రం తెలుసుకోము. ఆరోగ్యాన్ని ఇచ్చే ఆకులా.. అవేంటి అని ఆలోచిస్తున్నారా.. అయితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే మునగాకుల గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
మునగాకులో బోలెడు పోషకాలు
మునగాకుల మహత్యం తెలిస్తే ప్రతి ఒక్కరూ కచ్చితంగా మునగాకులను ఆహారంలో భాగంగా చేసుకుంటారు. మునగాకు లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే మునగాకును మనం ఏ రకంగా ఆహారంగా తీసుకున్నా అపరిమితమైన ప్రయోజనాలు కలుగుతాయి. బరువు తగ్గడానికి, చర్మం, జుట్టు సంరక్షణకు మునగాకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఆహారంలో మునగాకు ఆరోగ్యానికి మంచిది
గ్లోకోమా వంటి తీవ్రమైన కంటి సమస్యలకు కూడా మునగాకు చాలా బాగా పనిచేస్తుంది. మునగాకులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. శరీర ఆరోగ్యానికి దోహదం చేసే ఈ విటమిన్లు పుష్కలంగా ఉన్న మునగాకును పచ్చడి చేసుకు తిన్నా, పౌడర్ చేసుకుని నీళ్లలో కలుపుకొని తాగినా, మునగాకును పప్పులో వేసుకుని వండుకుని తిన్నా మంచి ప్రయోజనాలే కలుగుతాయి.
మహిళలకు, బాలింతలకు మునగాకు మేలు
మునగాకు తింటే మహిళల్లో హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. పునరుత్పత్తి వ్యవస్థ మెరుగుపడుతుంది. మునగాకులో ఉండే ఫైటో ఈస్ట్రోజన్ కంటెంట్ మహిళల రీప్రొడక్టివిటీకి తోడ్పడుతుంది. మునగాకులో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది. నీరసం నుంచి ఉపశమనం కలుగుతుంది. మహిళలకు శరీరానికి కావలసిన శక్తిని కూడా ఇస్తుంది. ఇక బాలింతలకు కూడా మునగాకు ఎంతో మేలు చేస్తుంది. బాలింతలలో సహజసిద్ధంగా పాల ఉత్పత్తికి మునగాకు దోహదం చేస్తుంది.
మూడొందల రోగాల్ని నయం చేసే మునగాకు
టైప్ టు డయాబెటిస్ ను నియంత్రించడానికి మునగాకు ఎంతో బాగా పనిచేస్తుంది. మునగాకులో ఉండే క్యాల్షియం, ఫాస్ఫరస్ ఎముకల బలాన్ని పెంచుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే మునగాకును ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది. ఒకటి కాదు రెండు కాదు మూడు వందల జబ్బులను నయం చేసే మునగాకు మనందరి ఆరోగ్య వరప్రదాయిని అంటే ఆశ్చర్యపోనవసరం లేదు.మునగాకు మహత్యం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మునగాకును ఆహారంలో భాగంగా చేసుకుంటారని భావిస్తున్నాం
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications