సులువుగా బరువు తగ్గే ఉపాయం చెప్పనా?
నిమ్మకాయ రసంలో తాటిబెల్లం లేదంటే నల్లబెల్లం పొడిచేసుకొని వేసుకోవచ్చు.
నిమ్మరసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిమ్మ తొక్క నుంచి నిమ్మరసం వరకు ప్రతి ఒకటి శరీరానికి మేలు చేసేవే. ఇందులో కార్పొహైడ్రేట్స్, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, ఫాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి. నిమ్మకాయ యాంటీ సెప్టిక్ గా బాగా ఉపయోపడుతుంది. ఆయుర్వేదంతోపాటు ఎన్నో రకాల ఔషధాల తయారీ కోసం నిమ్మకాయను ఉపయోగిస్తుంటారు. రోజువారీ ఆహారంలో నిమ్మను తీసుకోవడంవల్ల పలురకాల ఉపయోగాలున్నాయి.
నిమ్మరసంలో తేనె కలిపి తీసుకుంటే అజీర్తి, పైత్యం తగ్గుతాయి. నిమ్మరసం రక్తంలో కొవ్వును నియంత్రిస్తూ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా చూస్తుకుంటూ ఉంటుంది. మలబద్దకం, అజీర్తి సమస్యలన్నీ తగ్గిపోతాయి. తామర, చుండ్రు, గజ్జి, ఇలా ఒకటికాదు.. నిమ్మతో ఎన్నో ప్రయోజనాలను మనం పొందవచ్చు. అలాగే నిమ్మకాయను ఉపయోగించడంవల్ల బరువు కూడా తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా నిమ్మకాయ రసం తీసుకోవడం కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ మీకు నచ్చిన కూరగాయలను కట్ చేసుకొని అందులో నిమ్మరసం వేసుకొని తీసుకోవచ్చు. నిమ్మకాయనీళ్లు, ఉప్పు లేదా పంచదార వేసుకొని తీసుకోవచ్చు.

అయితే తాటిబెల్లం లేదంటే నల్లబెల్లం పొడిచేసుకొని వేసుకోవచ్చు. లేదంటే బరువు తగ్గాలి అనుకునేవారు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకొని ఉదయాన్నే తీసుకుంటే అజీర్తి మొదలైన సమస్యలు తలెత్తవు. ఇలా సులభంగా బరువు తగ్గొచ్చు. దగ్గు తగ్గడానికి, జలుబు తగ్గడానికి కూడా నిమ్మకాయను వాడొచ్చు. చాలామంది జలుబు ఉంటే నిమ్మరసం తాగకూడదు అంటారు. అంటువ్యాధుల నుంచి రక్షించే ఒక యాంటీ బయోటిక్ గా పనిచేయడంతోపాటు చర్మం, జట్టు కోసం యాంటీ ఆక్షిడెంట్ గా పనిచేస్తుంది. చర్మానికి, జట్టుకు కూడా అనేకరకాలుగా ఉపయోగపడుతుంది.












Click it and Unblock the Notifications