క్యాలీఫ్లవర్ పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..
క్యాలీఫ్లవర్ కేవలం టేస్ట్ మాత్రమే కాదు.. ఆరోగ్య పరంగానూ ఎన్నో పోషకాలు ఉన్నాయి. సాధారణంగా క్యాలీఫ్లవర్ కర్రీ, ఫ్రై చేసుకుంటారు. అయితే కాలీఫ్లవర్ పచ్చడి ఎప్పుడైనా తయారు చేశారా..? మరి సూపర్ టేస్టీ క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
నోరూరించే క్యాలీఫ్లవర్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూస్తే.. క్యాలీఫ్లవర్ ఒకటి, నూనె నాలుగు టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు పది, ఎండుమిర్చి రెండు, ఉప్పు తగినంత, కారం రుచికి తగినంత, పసుపు హాఫ్ స్పూన్, ఆవాలు రెండు టీ స్పూన్ లు, మెంతులు హాఫ్ టీ స్పూన్, ఇంగువ చిటికెడు, నిమ్మరసం కొద్దిగా, కరివేపాకు తీసుకోవాలి.
క్యాలీఫ్లవర్ పచ్చడి తయారీ విధానం చూస్తే.. ముందుగా క్యాలీఫ్లవర్ ను సన్నగా కట్ చేసుకుని నీటిలో 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఓ గిన్నె పెట్టుకోవాలి. అందులో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడెక్కిన తర్వాత ఆ నీటిలో క్యాలీఫ్లవర్ ముక్కలను వేసి కొద్ది సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలను ఓ క్లాత్ పై వేసి బాగా ఎండలో ఆరబెట్టాలి.
ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకుని అందులో ఆవాల నూనె వేసి వేడి చేయాలి. మరో గిన్నె తీసుకుని అందులో కాలీఫ్లవర్ ముక్కల్ని వేయాలి. ఇప్పుడు వేడి చేసిన నూనెను చల్లారినివ్వాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలకు ఉప్పు, ఆవాల పొడి, సోంపు పొడి, మెంతుల పొడి, కారం, పసుపు, ఇంగువ, వెనిగర్ వేయాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ మిశ్రమంలో నూనె వేసి అన్ని పదార్థాలు కలిసేలా బాగా మిక్సింగ్ చేసుకోవాలి.

మరొక పాన్లో ఆవాల నూనెను స్టవ్ మీద వేడి చేయండి. మరొక వైపు ఒక గిన్నె తీసుకోండి. అందులో కాలీఫ్లవర్ ముక్కలను వేయండి. నూనెను బాగా వేడి చేసి.. కొంచెం చల్లారనివ్వండి. ఆపై క్యాబేజీలో ఉప్పు, ఆవాల పొడి, సోంపు పొడి, మెంతుల పొడి, మిరపకాయల పొడి, పసుపు పొడి, ఇంగువ, వెనిగర్ వేయండి. మసాలా దినుసులు వేసిన తరువాత, క్యాలిఫ్లవర్ లో నూనె వేసి.. అన్ని పదార్థాలు బాగా కలిసేలా కలపండి. ఇప్పుడు మీ రుచికరమైన క్యాలిఫ్లవర్ పచ్చడి రెడీ అయినట్టే.












Click it and Unblock the Notifications