ఈ వేసవిలో కీరాదోస తినండి .. ఆరోగ్యంగా, అందంగా ఉండండి!

మార్చి నెల రానే వచ్చింది. ఇప్పటికే ఎండలు మండుతున్నాయి. ఈ ఎండాకాలంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎండాకాలంలో శరీరానికి చలువ చేసే ఆహారాన్ని తినడం ఎంతో మంచిది. ముఖ్యంగా సమ్మర్ సీజన్లో మనకు వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయలను ఎక్కువగా తినడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు అటువంటి వాటిలో కీరా దోస ఒకటి.

కీరా దోసతో బోలెడు లాభాలు
వేసవి కాలంలో కీరా దోసకాయలు తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. కీరా దోసలో 95% నీరు ఉంటుంది. ఇది వేసవిలో శరీరాన్ని చల్ల పరచడానికి డీ హైడ్రేషన్ సమస్య నుంచి కాపాడడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. కీరా దోసలో ఎక్కువగా నీరు ఉండడం వల్ల ఇది మనకు ఎంతో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. వేసవికాలంలో కీరాదోసను తీసుకోవడం వల్ల వడదెబ్బ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

Eat cucumber in this summer Stay healthy and beautiful

కీరాదోస ఇచ్చే ఆరోగ్యం అంతా ఇంతా కాదు
తీవ్రమైన ఎండ పరిస్థితిలోనూ కీర దోస శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. వేసవి కాలంలో కళ్ళు మండడం లేదా అలసిపోయినట్లుగా అనిపిస్తే కీరా దోసకాయ ముక్కను 10 నుంచి 15 నిమిషాల పాటు కళ్ళపై ఉంచడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కీరా దోసను ప్రతినిత్యం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఇది మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.

డయాబెటిస్, హైబీపీకి కీరా దోస బెస్ట్
కీరా దోస రసాన్ని వాడడం వల్ల చర్మం యవ్వనంగా, మృదువుగా ఉంటుంది. కీరా దోస రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. కీరా దోస కిడ్నీని శుభ్రపరచడంలోనూ, టాక్సిన్ లను బయటకు పంపించడంలోనూ బాగా ఉపయోగపడుతుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. మన కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. పునరుత్పత్తికి సహాయపడుతుంది.

బరువు తగ్గేందుకు కీరా దోస
కీరా దోసను ప్రతినిత్యం తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. కీరా దోసకాయలో ఉండే విటమిన్ కే రక్తం గడ్డ కట్టడానికి సహాయపడుతుంది. కీరా దోసకాయను గుజ్జుగా గ్రైండ్ చేసి దాని రసాన్ని తీసి నిమ్మరసం, తేనే కలిపి తీసుకుంటే మూత్రం సాఫీగా వస్తుంది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే కీరదోసను ఈ సమర్ సీజన్లో అసలే మర్చిపోవద్దు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+