ఊబకాయం తగ్గించే ఆహారాలు ఇవే!
ప్రస్తుత సమాజంలో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఊబకాయం అతి పెద్ద సమస్యగా మారింది. ఊబకాయం సమస్యతో బాధపడేవారు ఇతర ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఊబకాయం కారణంగా డయాబెటిస్, హైబీపీ, గుండె జబ్బులు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఊబకాయం తగ్గించుకోవాలని, బరువు తగ్గితే ఆరోగ్యంగా ఉంటామని చాలామంది భావించి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
బరువు తగ్గాలంటే ఆహారపు అలవాట్లు మారాలి
కానీ బరువు తగ్గాలంటే అన్నిటికంటే ముందు నిర్దిష్టమైన జీవన శైలి ఉండాలి. ప్రతిరోజు వ్యాయామం చేయడంతో పాటు మంచి ఆహారపు అలవాట్లు ఉండాలి. ఏది తింటున్నాం? ఎంత తింటున్నాం? ఎలా తింటున్నాం? అనేది అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు తినాల్సి ఉంటుంది. ఇక బరువు తగ్గాలని భావించేవారు ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే మంచిదో ప్రస్తుతం తెలుసుకుందాం.

ఇవి ఆహారంలో భాగం చేసుకుంటే బరువు తగ్గుతారు
ఊబకాయం నుండి విముక్తి పొందాలని భావించేవారు బరువు తగ్గడానికి పండ్లు, కూరగాయలను తమ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అధిక ఫైబర్ ను కలిగి ఉండి, క్యాలరీలు తక్కువగా ఉండే పండ్లను, కూరగాయలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఊబకాయం నుండి విముక్తి లభిస్తుంది. అంతేకాదు బరువు తగ్గాలని భావించేవారు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే అన్నానికి బదులు గోధుమ, ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా వంటి తృణధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు అవసరం
బరువు తగ్గాలంటే తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. ఆహారంలో ఆలివ్ నూనె ఉపయోగిస్తే మంచిది. లీన్ ప్రోటీన్ ను ఆహారంలో భాగంగా చేసుకుంటే బరువు తగ్గుతారు .చికెన్, చేపలు, బీన్స్, పప్పులు, గుడ్లు వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఆహారంలో తక్కువ చక్కెర ఉండే పదార్థాలను తీసుకోవాలి. అలాగే ఉప్పును కూడా అధికంగా వాడకుండా ఉండాలి.
అధిక బరువుకు చెక్ పెట్టే ఆహారపు అలవాట్లు
అలాగే బయట ఆహారాలకు దూరంగా ఉండాలి. ప్రాసెస్ చేసిన ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వంటి వాటిని తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఊబకాయం నుండి విముక్తి లభిస్తుంది. ఆహారం విషయంలో ఈ నియమాలను ఎప్పటికీ పాటిస్తే అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు.












Click it and Unblock the Notifications