చెడు కొవ్వు కరిగించే ఈ కూరగాయలు తినండి... రిజల్ట్ మీరే చూడండి!
బరువు తగ్గాలని భావించేవారు బరువు తగ్గటం కోసం ఏం తినాలి? ఏం తినకూడదు అనేది కచ్చితంగా తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో బరువు తగ్గటం కోసం చాలా మంది రకరకాల డైట్ లను ఫాలో చేస్తున్నారు. అయితే బరువు తగ్గాలంటే, సులభంగా బరువు తగ్గించే ఆహారాలను తినాలని కొందరు డైటీషియన్స్ చెప్తున్నారు. అయితే బరువుకు చెక్ పెట్టటంలో కొన్ని కూరగాయల పాత్ర చాలా ఉంటుందని అంటున్నారు.
దోసకాయ
దోసకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దోసకాయాలలో ఫైబర్ అధికంగా ఉండటం కారణంగా ఇది బరువు తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది. దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన కడుపు నిండిన ఫీలింగ్ కలిగిస్తుంది. దోసకాయలు ఆకలిని తగ్గిస్తాయి. ఇవి మన బరువును నియంత్రణలో ఉంచుతాయి.

సొరకాయ
సొరకాయలో కూడా బరువును తగ్గించే బోలెడు పోషకాలు ఉంటాయి. సొరకాయలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సొరకాయను కూడా మనం ఆహారంలో భాగంగా చేసుకుంటే బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ.. ఇది మన ఆకలిని తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
పుచ్చకాయ
పుచ్చకాయ బరువు తగ్గటానికి ఎంతగానో దోహదం చేస్తుంది. పుచ్చాకాయలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
పుచ్చకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇది జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది.పుచ్చకాయ గింజల్లో ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ తో పాటు బోలెడు పోషకాలు ఉంటాయి. ఇవి కడుపు నిండుగా ఉండేందుకు, ఆకలిని తగ్గించడంలో సహాయపడతాయి. ఫలితంగా ఇవి మన బరువును తగ్గిస్తాయి.
గుమ్మడికాయ
గుమ్మడికాయలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి గుమ్మడికాయ మన బరువు తగ్గడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఇందులో ఫైబర్ నీరు అధికంగా ఉండడం వల్ల మన కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది గుమ్మడికాయను ఆహారంలో భాగంగా చేసుకుంటే కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఇది మన బరువును తగ్గించడానికి దోహదం చేస్తుంది.
వీటితో కూడా బరువు తగ్గొచ్చు
ఇక ఇవి మాత్రమే కాదు బ్రోకలీ, క్యాబేజ్, క్యాలీ ఫ్లవర్, పాలకూర, పుట్ట గొడుగులు కూడా మన ఆకలిని తగ్గించి మనం బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయి. కనుక పై ఆహారాలు మీ భోజనంలో భాగం చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications