ఈ కాలంలో ఈ పండు తినండి... షుగరు అనేదే రాదు
నేరేడు పండును జామున్ లేదా బ్లాక్ ప్లమ్ అని కూడా అంటారు. ఇది రుచితోపాటు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఒక శక్తివంతమైన పండు. వర్షాకాలంలో లభించే ఈ పండులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నేరేడు పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచదు. ఇందులో "జాంబోలిన్" అనే సమ్మేళనం ఉంటుంది, ఇది పిండి పదార్థాన్ని చక్కెరగా మార్చడాన్ని నిరోధించడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
అంటువ్యాధుల నుంచి రక్షిస్తుంది
నేరేడు పండు, దాని గింజలు మధుమేహ వ్యాధిగ్రస్తులలో అధిక మూత్ర విసర్జన, దప్పిక వంటి లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. నేరేడు పండులో పీచు పదార్థం మెండుగా ఉండి జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. కడుపునకు సంబంధించిన సమస్యలను తగ్గించి, పేగుల కదలికలను క్రమబద్ధీకరిస్తుంది. నేరేడు పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. శరీరంలో అంటువ్యాధులు, జలుబు, దగ్గు వంటి సాధారణ అనారోగ్యాల నుండి రక్షించడానికి సహాయపడుతుంది.

ఖాళీ కడుపుతో మాత్రం తినొద్దు
ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.గుండె ఆరోగ్యానికి మంచిది. అలాగే పొటాషియం అధికంగా ఉంటుంది. రక్త నాళాలను విస్తరించి రక్త ప్రవాహాన్ని సులభతరం చేసి రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు గుండె కండరాలను బలోపేతం చేసి, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
నేరేడు పండులో ఆంథోసైనిన్‌లు, ఫ్లేవనాయిడ్‌లు, పాలిఫెనాల్స్‌తో సహా అనేక రకాల శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మొటిమలు, ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహార ఎంపిక. నేరేడు పండులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఎముకలు దృఢంగా ఉండటానికి సహాయపడతాయి. అయితే వీటిని ఎప్పుడూ ఖాళీ కడుపుతో తినకూడదు.












Click it and Unblock the Notifications