చికెన్ తింటున్నారా? వీటితో కలిపి అసలే తినొద్దు!
చాలామంది చికెన్ ను చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ మన శరీరానికి కావలసిన ప్రోటీన్ తోపాటు బోలెడు పోషకాలను అందిస్తుంది. ఇక చికెన్ ప్రియులు చికెన్ తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చికెన్ తో పాటు కొన్ని పదార్థాలను అస్సలు తినకూడదు. చికెన్ తో పాటు తినకూడని పదార్థాలను తినడం వల్ల ఆరోగ్యంపైన చెడు ప్రభావం పడుతుంది.
వీటితో కలిపి చికెన్ తినొద్దు
చికెన్ తో పాటు తినకూడని పదార్థాలు ఏమిటి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. చికెన్ తినేవాళ్లు పాలతోపాటు చికెన్ అసలు తినకూడదు. చికెన్ తిన్న తర్వాత పాలు తాగడం కానీ, పాలు తాగిన తర్వాత చికెన్ తినడం కానీ చేయకూడదు. ఇవి మన శరీరం పైన చెడు ప్రభావాన్ని కలిగిస్తాయి. పాలతో చికెన్ కలిపి తింటే శరీరంలో అలర్జీలు సంభవించే అవకాశం ఉంటుంది.

చికెన్ తో పెరుగు తింటున్నారా?
చికెన్ తో పాలు కలిపి తీసుకోవడం వల్ల కొంతమందికి శరీరం పైన దద్దుర్లు, తెల్ల మచ్చలు, దురద వంటి సమస్యలు వస్తాయి. ఇక చాలామంది పెరుగు వేసి చికెన్ వండుతారు. పెరుగు కాంబినేషన్లో చికెన్ ను తింటారు. అయితే ఇది కూడా మంచిది కాదని చెబుతున్నారు డైటీషియన్లు.
ఇలా తింటే డేంజర్
పెరుగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయినప్పటికీ చికెన్ తో పాటు పెరుగును తినడం మంచిది కాదని చికెన్ ప్రభావం మన శరీరం పై వేడిగాను, పెరుగు ప్రభావం మన శరీరం పై చల్లగాను ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని కలిపి తినడం జీర్ణ వ్యవస్థ పైన చెడు ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు. చాలామంది నాన్ వెజ్ ఐటమ్స్ అన్నింటిని ఒకేసారి తింటూ ఉంటారు. ఈ క్రమంలో చికెన్ తో పాటు కొన్ని తినకూడని పదార్ధాలు ఉన్నాయి.
చికెన్ తో పాటు చేపలు తింటున్నారా?
చికెన్ తో చేపలు కూడా తింటారు. అయితే ఇవి రెండూ కలిపి తినడం కూడా మంచిది కాదని చెబుతున్నారు. చికెన్ చేపలు రెండింటిలోనూ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. చికెన్ లోనూ, చేపల్లోనూ వివిధ రకాల ప్రోటీన్లు ఉంటాయి. చికెన్ తో చేపలు తినడం ఆరోగ్యానికి ఏ విధంగానూ మంచిది కాదు. మన శరీరానికి మోతాదును మించి ప్రోటీన్ తీసుకున్న కూడా అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చికెన్ తో కలిపి చేపలను తినకూడదు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని చికెన్ ప్రియులు చికెన్ ను ఎంజాయ్ చేయండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications