నాన్ స్టిక్ పాత్రలలో వండింది తింటున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి!

ప్రస్తుతం అందరూ నాన్ స్టిక్ పాత్రలను ఉపయోగిస్తున్నారు. నాన్ స్టిక్ కుక్ వేర్ లోనే వంటలు చేయడం ఆరోగ్యమని భావిస్తున్నారు. అయితే నాన్ స్టిక్ కుక్ వేర్ లో వంట చేయడం చాలా డేంజర్ అని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. యుఎస్ లో ఇటీవలకాలంలో టెఫ్లాన్ ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, అందుకు నాన్ స్టిక్ కుక్ వేర్ లను ఉపయోగించడమే కారణమని వైద్య నిపుణులు గుర్తించారు.

నాన్ స్టిక్ కుక్ వేర్ తో యూఎస్ లో టెఫ్లాన్ ఫ్లూ
నాన్ స్టిక్ కుక్ వేర్ లను విపరీతంగా వేడి చేయడం కారణంగా వాటిలో ఉండే వంటలను తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని గుర్తించారు. యుఎస్ లో 3600 రిపోర్టులలో పాలిమర్ ఫ్యూమ్ ఫీవర్ కెమికల్ కోటింగ్ తో కనెక్ట్ అయిన ఫీవర్ కేసులు గుర్తించినట్టు వెల్లడించారు. దీనిని టెఫ్లాన్ ఫ్లూ గా పేరు పెట్టారు.

Eating cooked in non-stick cookware These are must-knows

నాన్ స్టిక్ కుక్ వేర్ ఓవర్ హీట్ అయితే డేంజర్
గత సంవత్సరం 267కేసులు ఈ టెఫ్లాన్ ఫ్లూ కేసులు రిపోర్ట్ అయినట్టు వాషింగ్టన్ పోస్టు వెల్లడించింది. నాన్ స్టిక్ కుక్ వేర్ లలో ఉపయోగించే టెఫ్లాన్ కోటింగ్ ఓవర్ హీట్ అయినప్పుడు దానిలోని కెమికల్ పార్టికల్స్ మనం తినే ఆహారంలో కలుస్తున్నాయని ఫలితంగా టెఫ్లాన్ ఫ్లూ వస్తుందని వైద్యనిపుణులు తేల్చారు. నాన్ స్టిక్ పాన్ ను 500 డిగ్రీల ఫారిన్ హీట్ పైన వేడి చేసినప్పుడు దానిలోని కోటింగ్ దెబ్బతింటుందన్నారు.

టెఫ్లాన్ కోటింగ్ కాస్త పోయినా ఆ పాత్రలు వాడొద్దు
అది విషపూరితమైనటువంటి కెమికల్స్ ను ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నారు. టెఫ్లాన్ పాన్ లను ఓవర్ హీట్ చేయడం ఏమాత్రం మంచిది కాదని అంతేకాదు కొద్దిగా కోటింగ్ పోయినప్పటికీ ఆ పాన్ లను ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు. నాన్ స్టిక్ పాన్ ల పైన ఒక సింగిల్ స్క్రాచ్ ఉన్నప్పటికీ దానిని ఉపయోగించడం మంచిది కాదని చెబుతున్నారు.

ఒక్క స్క్రాచ్ ఉన్నా 9000 కెమికల్ పార్టికల్స్ కడుపులోకి
ఒక సింగిల్ స్క్రాచ్ నాన్ స్టిక్ పాన్ల పైన ఉన్నప్పటికీ అది 9000కెమికల్ పార్టికల్స్ ను ప్రొడ్యూస్ చేస్తుందని అందుకే నాన్ స్టిక్ పాన్లను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. టెఫ్లాన్ ఫ్లూ మాత్రమే కాదు నాన్ స్టిక్ పాన్ లో ఉండే కోటింగ్ మన కడుపులోకి వెళితే చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని కిడ్నీ సమస్యలు వస్తాయని అలాగే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కనుక నాన్ స్టిక్ పాన్ల వినియోగం విషయంలో తస్మాత్ జాగ్రత్త.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+