కోడిగుడ్లు తింటున్నారా? రోజుకు ఎన్ని గుడ్లు తినొచ్చో మీకు తెలుసా!
కోడిగుడ్లు.. మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుకే ప్రతిరోజు ఒక గుడ్డును తినాలని పెద్ద ఎత్తున ప్రభుత్వాలు కూడా ప్రచారం చేస్తున్నాయి. ప్రతిరోజు ఒక కోడి గుడ్డును తినడం మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. ఒక కోడిగుడ్డులోని తెల్లసొనలో సుమారు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
కోడిగుడ్లు ఎన్ని తినొచ్చు
కోడిగుడ్లు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. కోడిగుడ్లు కండరాల బలాన్ని పెంచుతాయి. వీటిలో విటమిన్లు, ఖలిజలవణాలు మన శరీరానికి కావలసిన పోషకాలను అందించి, శరీరాన్ని పుష్టిగా ఉంచేలా చేస్తాయి. అయితే అటువంటి కోడిగుడ్లను ఎన్ని తినొచ్చు? ఎన్ని తింటే ఆరోగ్యంగా ఉంటాం అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ఆరోగ్యవంతులు వారానికి ఎన్ని గుడ్లు తినొచ్చు అంటే
కోడిగుడ్డు మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లను అందించడమే కాకుండా, మనల్ని అనేక వ్యాధుల బారి నుండి కాపాడడానికి ఉపయోగపడతాయి. అయితే కోడిగుడ్లను తినే విషయంలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని ఇష్టారాజ్యంగా తినడం ఏ మాత్రం మంచిది కాదు. అయితే ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి వారానికి ఏడు నుంచి పది గుడ్లు తీసుకోవచ్చని న్యూట్రిషనిస్ట్ లు చెబుతున్నారు.
వ్యాయామం చేసేవారు, అథ్లెట్ లు రోజుకు ఎన్ని గుడ్లు తినొచ్చంటే
ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతిరోజు ఒక పూర్తి గుడ్డును తీసుకోవచ్చని సూచిస్తున్నారు. కోడిగుడ్డు మన శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ ను ప్రోత్సహిస్తుందని అయితే అలాగని ఇష్టం వచ్చినన్ని గుడ్లు తినకూడదని చెబుతున్నారు. వ్యాయామం చేసే వారికి, అథ్లెట్ లకు పోషకాహారం అవసరం అవుతుందని అలాంటివారు రోజుకు నాలుగు నుంచి ఐదు గుడ్లు తినవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని గుడ్లు తినాలి
ఒక గుడ్డును మొత్తంగా తీసుకుంటే మన శరీరానికి 13 గ్రాముల ప్రోటీన్ అందుతుందని అదే గుడ్డులోని తెల్ల సొన వరకు తీసుకుంటే ఆరు గ్రాముల ప్రోటీన్ అందుతుందని చెబుతున్నారు. అయితే గుడ్డును ఆహారంలో భాగంగా తీసుకోవాలి అనుకునేవారు తమకు ఉన్న అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని వైద్యుల సలహా మేరకు గుడ్డును ఆహారంలో భాగంగా చేసుకోవాలని సూచిస్తున్నారు.
డయాబెటిస్, హై బీపీ ఉంటే ఇలా గుడ్లు తినాలి
డయాబెటిస్ తో బాధపడుతున్న వారు ఆహారంలో గుడ్డును తీసుకోవాలంటే వైద్యుల సలహా తీసుకుంటే మంచిదని, వారు వారానికి రెండు లేదా మూడు గుడ్లు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం రాదని చెబుతున్నారు. ఇక అధిక రక్తపోటు ఉన్నవారు గుడ్లను ఆహారంలో భాగంగా చేసుకోకపోతేనే మంచిదని, ఒకవేళ వారు గుడ్లను తినాలి అనుకుంటే తెల్ల సొన మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు.
కోడిగుడ్డు పోషకాహారమే.. కానీ
మూత్రపిండాలు పనిచేయని వారు కోడిగుడ్లను ఆహారంగా తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. మొత్తంగా కోడిగుడ్డు మంచి పోషకాహారమే అయినప్పటికీ దీని అధిక వినియోగం ఏమాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. అనేక వ్యాధులు ఉన్నవారికి ఎక్కువ గుడ్లు తినటం అసలే మంచిది కాదని చెప్తున్నారు.
disclaimer: ఈ కథనం ఆహార నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications