కోడిగుడ్డు ఇలా తింటే విషంతో సమానం!
ప్రతిరోజు గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి ప్రభుత్వాలు. కోడిగుడ్డులో మన శరీరానికి కావలసిన ప్రోటీన్, విటమిన్, ఖనిజాలు ఎన్నో ఉంటాయని, కోడిగుడ్డులో ఉండే పోషకాలు మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయని, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని చెబుతారు. కోడిగుడ్డులో విటమిన్ డి, విటమిన్ ఏ, విటమిన్ బి12, ప్రోటీన్లు, కొవ్వులు, ఖనిజాలు, కోలిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయని చెప్తారు.
కోడి గుడ్లతో ఆరోగ్యం
తక్కువ కేలరీలతో గుడ్డు మనకు ఎక్కువ శక్తిని అందిస్తుందని చెబుతారు.ప్రతిరోజు గుడ్డు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని, కంటికి మేలు చేకూరుతుందని చెబుతారు. కండరాలు, నరాల ఆరోగ్యానికి కూడా కోడిగుడ్లు మంచి చేస్తాయని చెబుతారు. అటువంటి కోడిగుడ్డును కొందరు ఉడికించుకుని తింటే, కొందరు ఆమ్లెట్ గా వేసుకుని, స్క్రాంబుల్డ్ గా చేసుకుని తింటారు.

గుడ్డు ఇలా తీసుకుంటే ఆరోగ్య నష్టాలు
కొంతమంది ఉడికించని గుడ్లను తినడం ఆరోగ్యమని భావించి పచ్చి గుడ్లను ఇష్టారాజ్యంగా తింటూ ఉంటారు. ముఖ్యంగా ఫిట్నెస్ పట్ల శ్రద్ధ ఉన్నవారు పచ్చి గుడ్డుతో బలం వస్తుందని నమ్మి దానిని తీసుకుంటారు. అయితే ఇది మంచిది కాదని, దీనివల్ల నష్టాలు వస్తాయని, ఒక్కోసారి దీనివల్ల శరీరం విషపూరితమవుతుందని చెబుతున్నారు.
గుడ్లలో ఈ బ్యాక్టీరియాతో ఫుడ్ పాయిజన్ ఛాన్స్
పచ్చి గుడ్లలో సాల్మొనెల్లా అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా మన శరీరానికి హాని చేస్తుంది. శరీరంలో అలర్జీలకు కారణమవుతుంది. ఒక్కోసారి పచ్చి గుడ్లు ఫుడ్ పాయిజన్ అవ్వడానికి కూడా కారణమవుతాయి. గుడ్లలో ఉన్న బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను బలహీనపరిచి ఆరోగ్య నష్టం చేస్తుంది. కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు పచ్చి గుడ్లను తింటే అనవసరమైన ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
గుడ్డు ఇలా తింటే మంచిది కాదు
పచ్చి గుడ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్ లభించదు. ఈ గుడ్లను ఉడకబెట్టి లేదా వండి తినడం వల్ల శరీరానికి నష్టం జరగదు. ఉడక పెట్టకుండా పచ్చి గుడ్డు సొన తీసుకుంటే మాత్రం అపారమైన నష్టం జరిగే ప్రమాదం ఉంది. కనుక గుడ్లను పచ్చిగా తినడం మంచిది కాదనే విషయాన్ని గుర్తుంచుకొని బాగా ఉడికించుకుని, వండుకుని తింటే మంచిది.












Click it and Unblock the Notifications