స్వీట్స్ బాగా తింటున్నారా? త్వరగా ముసలితనం వస్తుంది.. జాగ్రత్త!
చాలామంది స్వీట్స్ ఇష్టంగా తింటారు. ఇక పండుగల సమయంలో అయితే స్వీట్స్ తినకుండా ఉండలేరు. అయితే స్వీట్స్ ఎక్కువగా తినడం మంచిదేనా? స్వీట్స్ తినడం వల్ల ఆరోగ్యం పైన ఎటువంటి ప్రభావాలు పడతాయి? స్వీట్స్ తో వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
స్వీట్స్ తో అనారోగ్యాలు
స్వీట్స్ తినడం వల్ల ఆరోగ్యం పైన చెడు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా స్వీట్స్ ఎక్కువ తినేవారిలో డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. చక్కెర తో తయారు చేసిన స్వీట్స్ ఎక్కువగా తినేవారు ఊబకాయ బాధితులుగా కూడా మారుతారు. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

స్వీట్స్ తో ముఖంపై ముడతలు
స్వీట్స్ ఎక్కువగా తినేవారిలో చిన్న వయసులోనే పెద్ద వయసు వారిలాగా కనిపించేలా ముఖం మీద ముడతలు వస్తాయి. వయసుకు మించి వృద్ధాప్యం వచ్చినట్టుగా కనిపిస్తారు. స్వీట్స్ ఎక్కువగా తినేవారిలో చర్మ సౌందర్యం బాగా తగ్గిపోతుంది. స్వీట్స్ చర్మం పైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి.
స్వీట్స్ తింటే జరిగేదిదే
స్వీట్స్ లో ఉండే చక్కెర మనం తిన్న తర్వాత మన శరీరంలో గ్లైకేషన్ అనే ప్రక్రియను బాగా ప్రోత్సహిస్తుంది . దీంతో చర్మం లోని కొలాజిన్ దెబ్బతింటుంది. దీనివల్ల త్వరగా వృద్ధాప్యం వస్తుంది. స్వీట్స్ లో ఉండే చక్కెర కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని బాగా పెంచుతుంది.
స్వీట్స్ తో చర్మ సౌందర్యం దెబ్బ తింటుంది
ఇక పెరిగిన ఇన్సులిన్ స్థాయిల కారణంగా శరీరంలోని సెబాషియన్ గ్రంధులు సెబమ్ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. ఫలితంగా శరీరం జిడ్డుగా మారి, చర్మ సహజ సౌందర్యాన్ని కోల్పోతుంది. స్వీట్స్ తినేవారిలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ముఖం పైన మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక స్వీట్స్ తినాలని భావించేవారు చక్కెరతో తయారు చేసిన స్వీట్స్ తినడం వల్ల కలిగే అనారోగ్యాలను దృష్టిలో ఉంచుకోవాలి.
చక్కెర స్వీట్స్ తో జాగ్రత్త
చక్కెరతో కాకుండా బెల్లంతో తయారు చేసిన పదార్థాలు కొంతవరకు మేలు చేస్తాయి. కానీ మొత్తంగా చూస్తే స్వీట్స్ తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. దీపావళి పండుగ వేళ ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకొని స్వీట్స్ తినే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications