రాత్రి పడుకునే ముందు ఇవి తింటే మీకు నిద్రలేమి, అనారోగ్యాలు!
మన ఆరోగ్యంలో ఆహారం పాత్ర గణనీయంగా ఉంటుంది. ఎప్పుడు, ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి? ఏ సమయంలో వేటికి దూరంగా ఉండాలి? అనేది ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా రాత్రివేళ మన శరీరానికి ఎంత అవసరమో అంత నిద్ర కచ్చితంగా పోవాలి. ఇక మంచిగా హాయిగా నిద్రపోవాలి అనుకునేవారు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
రాత్రి పడుకునే ముందు తీసుకోకూడని ఆహారాలు
నిద్రకు ఉపక్రమించే రెండు గంటల ముందే ఆహారాన్ని తీసుకోవాలి. అయితే రాత్రివేళ తెలిసి తెలియక కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే నిద్ర భంగం కలుగుతుంది. నిద్రపోవడం కష్టంగా మారుతుంది. ఇక రాత్రివేళ పడుకునే ముందు తీసుకోకూడని ఆహారాలు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

రాత్రి ఇవి తీసుకుంటున్నారా? ఆరోగ్యంపై ప్రభావం
రాత్రివేళ పడుకునే ముందు కొన్ని రకాల ఫుడ్స్, డ్రింక్స్ తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు పెరిగి సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు. సరిగ్గా పడుకునే సమయానికి ముందు తినే ఆహారం జీర్ణ వ్యవస్థ పైన ప్రభావాన్ని చూపిస్తుంది. త్వరగా నిద్రపోకుండా చేస్తుంది. ఇక రాత్రివేళ పడుకునే ముందు కాఫీ, టీ, చాక్లెట్లని తీసుకోకుండా ఉంటే మంచిది.వీటివల్ల నిద్ర భంగం కలుగుతుంది.
ఇవి తింటే నిద్రా భంగం
రాత్రి సరిగ్గా పడుకునే సమయానికి ముందు బాగా కారం, మసాలాలు ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు. వీటిని తీసుకుంటే శరీర వేడి పెరిగి నిద్ర రాకుండా చేస్తుంది. పిజ్జాలు, బర్గర్లు, హెవీ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోకూడదు. ఇవి తీసుకుంటే నిద్రకు అసౌకర్యం కలుగుతుంది. నిద్ర పట్టకుండా ఇబ్బంది పడతారు. అంతే కాదు రాత్రివేళ పడుకునే ముందు తీపి పదార్థాలను కూడా తినకూడదు. ఇవి కూడా మనకు నిద్ర భంగాన్ని కలిగిస్తాయి.
నిద్రవేళలో ఇవి ఆహారంగా తీసుకుంటే నిద్రలేమి
నిద్రకు ముందు పచ్చి ఉల్లిపాయలు తినకూడదు. ఇవి జీర్ణవ్యవస్థలో గ్యాస్ ఏర్పడేలా చేసి నిద్రకు భంగం కలిగిస్తాయి. ఇక నిద్రకు ముందు ఎనర్జీ డ్రింక్స్ కూడా తాగకూడదు. నిద్రకు ముందు ఆల్కహాల్ తీసుకోవడం కూడా నిద్రలో నాణ్యతను తగ్గిస్తుంది . నిద్ర వేళకు ఎక్కువ నీరు తాగకూడదు. ఒకవేళ అలా తాగితే అర్ధరాత్రి మూత్ర విసర్జనకు లేవవలసి వస్తుంది. దీనివల్ల నిద్ర భంగం కలుగుతుంది. రాత్రివేళ సిట్రస్ పండ్లు తినకూడదు. ప్రశాంతంగా నిద్ర పోవాలి అనుకునే వాళ్ళు నైట్ ఆహారం విషయంలో పైన పేర్కొన్న వాటిని తినకుండా ఉంటేనే మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications