"కోడిగుడ్డు వెల్లుల్లి కారం" ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా.. యమా టేస్టూ !!
కోడిగుడ్డు అనేది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎక్కువగా ఇష్టపడే తినే ఆహారంగా చెప్పొచ్చు. అత్యంత పోషక విలువలతో కూడిన గుడ్లతో చేసే ఏ వంటకమైనా ప్రతీ ఇంట్లోనూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటుంది. త్వరగా తయారవడం, అద్భుతమైన రుచితోపాటు పూర్తి పోషకాహారం కావడంతో చాలా మంది ఇష్టంగా తింటారు. సాధారణంగా బుర్జీ, పులుసు, ఆమ్లెట్, కర్రీ వంటి వంటకాలు తరచూ చేస్తుంటారు.
అయితే ఎప్పుడూ ఒకే రకంగా చేసి బోర్ అనిపించే వారి కోసం తెలంగాణాలో పాపులర్ అయిన "కోడిగుడ్డు వెల్లుల్లి కారం"ను రెసిపీ తీసుకొచ్చాం. ఈ వంటకం ఇంట్లోనే రెస్టారెంట్ రుచి ఇస్తుంది. అంతే కాకుండా గుడ్లు వల్ల ప్రోటీన్, విటమిన్ A, D, E, B12 సహా ముఖ్యమైన పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. అలానే వెల్లుల్లి కారం సువాసన, మసాలాల రుచి ఈ వంటకం రుచి కలిస్తే డబుల్ అవుతుందని అంటున్నారు.

వెల్లుల్లి కారం ఎలా చేయాలంటే..
ఈ వంటకంలో ప్రధాన ఆకర్షణ వెల్లుల్లి కారం పొడే. ఇది గుడ్డు ముక్కలకు ప్రత్యేకమైన కారంపులుపుతో కూడిన సువాసన, రుచిని ఇస్తుంది. దీనిని సిద్ధం చేసేందుకు రెండు టేబుల్ స్పూన్ల కారం, ఒక పెద్ద వెల్లుల్లి పొట్టు, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ జీలకర్రను తీసుకుని మిక్సీ జార్‌లో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేస్తారు. ఈ పొడిని గుడ్డు వేగించిన తర్వాత కలపడం వల్ల వంటకానికి అసలు తెలంగాణ టచ్ వస్తుంది.
కోడిగుడ్డు వెల్లుల్లి కారం కోసం కావాల్సిన పదార్థాలు..
- కోడిగుడ్లు - 5
- పెద్ద ఉల్లిపాయలు - 2
- నూనె - తగినంత
- పోపు దినుసులు:
- ఆవాలు - కొద్దిగా
- జీలకర్ర - కొద్దిగా
- మినపపప్పు - 1 టీస్పూన్
- శనగపప్పు - 1 టీస్పూన్
- ఎండుమిర్చి - 2
- కరివేపాకు - 2 రెమ్మలు
- పసుపు - ¼ టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
ఇవన్నీ ఇంట్లో తరచూ ఉండే పదార్థాలే కావడంతో ఈ రెసిపీని ఎప్పుడైనా సులభంగా తయారు చేసుకోవచ్చు.
తయారీ విధానం..
ముందుగా పాన్‌లో నూనె వేసి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి చిటపటలాడే వరకు వేయిస్తారు. వాటితో పాటు ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి.
తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి మీడియం ఫ్లేమ్‌లో బంగారు గోధుమరంగులోకి వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి కలపాలి.
పాన్‌లో మధ్యలో కొంచెం ఖాళీ చేసి గుడ్లను పగులగొట్టి వేస్తారు. గుడ్డు అంచులు కొద్దిగా ఉడికిన తర్వాత మాత్రమే వాటిని తేలికగా కలపాలి. ఇలా నెమ్మదిగా ఉడికిస్తే గుడ్డు ముక్కలు చెదరకుండా మృదువుగా, అద్భుతమైన టెక్స్చర్‌తో వస్తాయి.
స్టవ్‌ను లో ఫ్లేమ్‌లో ఉంచి మూతపెట్టి 2-3 నిమిషాలు ఉడికిస్తే గుడ్లు అద్భుతంగా పఫ్ అయి కాస్త క్రిస్పీగా మారతాయి.
గుడ్లు వేగాక, ముందుగా సిద్ధం చేసుకున్న వెల్లుల్లి కారాన్ని పాన్‌లో వేసి బాగా కలపాలి. కొన్ని నిమిషాలు వేయించిన తర్వాత గుడ్డు ముక్కలన్నీ కారం పట్టి ఎర్రగా మెరిసిపోతాయి.
చివరగా కొత్తిమీర తరుగు వేసి వేడి వేడి అన్నంలో కలిపి తింటే రుచి మరింత పెరుగుతుంది.
అన్నం, రోటీ, చపాతీ, పరోటా, దోశ, బిర్యానీ ఇలా దేనితో అయినా ఈ "కోడిగుడ్డు వెల్లుల్లి కారం" అద్భుతంగా సరిపోతుంది.
సూచనలు..
గుడ్డు కారం డ్రైగా తయారు చేస్తే రెండు రోజుల పాటు కూడా పాడవకుండా తాజాగా ఉంటుంది. ప్రయాణాలకు తీసుకెళ్లేందుకు, టిఫిన్ బాక్స్‌కి పెట్టేందుకు కూడా ఇది అద్భుతమైన డిష్.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
పచ్చికారం సొరకాయ కూర.. ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు! -
"ముల్లంగి మజ్జిగ పులుసు" ఇలా చేస్తే యమా టేస్టు.. -
నయా స్టైల్ లో ఎగ్ మసాలా కర్రీ.. ఇదొక్కడి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications