'ఎగ్‌ ఖీమా మసాలా'.. ఇలా చేస్తే నా సామిరంగ లొట్టలేసుకుంటూ తింటారు..

గుడ్డులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. గుడ్డును పూర్తి పోషక ఆహారంగా అభివర్ణిస్తారు. గుడ్డును ఏ విధంగా చేసినా టేస్టీగానే ఉంటుంది. ఫ్రై చేసుకున్నా.. ఉడకపెట్టినా.. ఆమ్లెట్ వేసినా రుచిగానే ఉంటుంది. మరి గుడ్డుతో ఎగ్ ఖీరా మసాలా ఎప్పుడైనా ట్రై చేశారా..? ముఖ్యంగా శీతాకాలంలో సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ ఖీమా మసాలాను ఎలా తయారు చేసుకోవాలి..? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి..?

ఎగ్‌ ఖీమా మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఓసారి చూస్తే.. ఉడికించిన గుడ్లు 4-5 , ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజు, పచ్చిమిర్చి నాలుగు, టమాటా రెండు, క్యాప్సికమ్ ఒకటి, జీలకర్ర అర టీ స్పూన్, నూనె తగినంత, పసుపు పావు టీ స్పూన్, అల్లంవెల్లుల్లి పేస్టు అర టీ స్పూన్, కారం ఒక టీ స్పూన్, గరం మసాలా తగినంత, ధనియాల పొడి తగినంత తీసుకోవాలి.

Egg Kheema Masala Once You Start Eating You Literally Can t Stop

తయారీ విధానం చూస్తే.. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో నూనె పోయాలి. నూనె వేడెక్కాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులో టమాటా వేసి మూతపెట్టుకుని కాసేపు వేగనివ్వాలి. టమాటా మగ్గిన తర్వాత ఆ మిశ్రమంలో క్యాప్సికమ్ ముక్కలు, కారం, పసుపు, అల్లం పేస్టు, ధనియాల పొడి, మిరియాల పొడి, ఉప్పు వేసుకోవాలి. దాంతోపాటు తగినన్ని నీళ్లు పోసుకుని మగ్గనివ్వాలి. అలా లో ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఉడికించుకున్న గుడ్లను తురిమి అందులో వేయాలి. చివరగా కొత్తిమీర తురుము, నిమ్మరసం దానిపై పిండితే సరి.. ఘుమఘుమలాడే ఎగ్ ఖీమా మసాలా రెడీ అయినట్లే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+