విలేజ్ స్టైల్ పచ్చిమిర్చి కోడిగుడ్డు కర్రీ.. ఇదొక్కటి యాడ్ చేస్తే..!
కోడిగుడ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుడ్డులో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కంటి ఆరోగ్యానికి, కండరాల బలానికి, రోగనిరోధక శక్తికి తోడ్పడతాయి. అయితే ఎప్పుడూ కోడిగుడ్డుతో ఒకే రకంగా కాకుండా పచ్చిమిర్చి కోడిగుడ్డుతో ఇలా వెరైటీగా ట్రై చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఈ విలేజ్ స్టైల్ పచ్చిమిర్చి కోడిగుడ్డు కర్రీ తయారీ విధానం ఏంటి..? కావాల్సిన పదార్థాలు చూస్తే..?
విలేజ్ స్టైల్ పచ్చిమిర్చి కోడిగుడ్డు కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. ఉడికించిన కోడిగుడ్లు, నూనె తగినంత, ఉప్పు సరిపడా, పసుపు హాఫ్ స్పూన్, పచ్చిమిర్చి, పుదీనా తరుగు కొద్దిగా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర తురుము, బిర్యానీ ఆకు, ఉప్పు రుచికి సరిపడా, పెరుగు అర కప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి తీసుకోవాలి.
పచ్చి మిర్చి కోడిగుడ్డు కర్రీ తయారీ విధానం చూస్తే.. ముందుగా కోడిగుడ్లను ఉడికించుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని నూనె వేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, మిరియాలు, కొత్తిమీర, పుదీనా తరుగు వేయించుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు గిన్నెలో తగినంత నూనె వేసుకోవాలి. నూనెలో లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు వేసుకుని అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో పెరుగు వేసుకుని కలుపుకోవాలి. అలా రెండు నిమిషాలు ఉడికించుకున్నాక నీళ్లు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా వేయించుకున్న గుడ్లు వేసి కలపాలి. కర్రీని ఓ రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర తరుగు వేస్తే సరి..












Click it and Unblock the Notifications