వంకాయను దూరం పెట్టొద్దు.. ఎందుకో తెలుసా??
వంకాయ... అంటే తెలియనివారుండరు. ప్రపంచవ్యాప్తంగా దీనికి చాలా డిమాండ్ ఉంది. దీంతో చేసే కూర అత్యద్భుతంగా ఉంటుంది. అయితే చాలామంది వీటిని తినడానికి ఆసక్తి చూపించరు. కానీ వంకాయ వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
గుండెజబ్బులు రావు
వంకాయల్లో విటమిన్ కే, విటమిన్ బి6, పొటాసియం, మాంగనీస్, ఫోలేట్, ఫైబర్ వంటి పోషకాలుంటాయి. గుండె జబ్బులు రావు. వంకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నిర్మూలిస్తాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. సులువుగా బరువు తగ్గొచ్చు. కంటి సమస్యలు తగ్గడంతోపాటు చూపు మెరుగుపడుతుంది.

ఎముకలు బలంగా అవుతాయి
ఎముకలు ధృఢంగా తయారవుతాయి. ఎముకల సాంద్రత బాగా పెరుగుతుంది. జుట్టును, చర్మాన్ని, గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. వంకాయలను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అయితే నూనెను తక్కువగా ఉపయోగించాలని సూచిస్తున్నారు.
క్యాన్సర్ రాకుండా చూస్తుంది
వంకాయలో పిండి పదార్థాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని హైడ్రైట్లను తొలగించి గుండె సమస్యలను నివారిస్తుంది. కొవ్వును కరిగిస్తుంది. ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ3, బీ6, బీటా కేరోటిన్, యాంటీఆక్సిడెంట్లు తదితర పోషకాలు గుండెపోటు, స్ట్రోక్ ముప్పును తగ్గిస్తాయి. శరీరంలోని అదనపు ఐరన్‌ను తొలగించడంతోపాటు ఫైబర్ ఎక్కువగా ఉండి కొంచెం తినగానే కడుపు నిండిన భావన కలిగిస్తుంది. శరీరంలోని విషాలను, రసాయనాలను గ్రహించి క్యాన్సర్ ముప్పు రాకుండా తోడ్పడతాయి.












Click it and Unblock the Notifications