రోజూ గుడ్డు తింటే మీరు షెడ్డుకే..? కొత్త అధ్యయనం ఏం చెబుతుంది..?

సండే అయినా మండే అయినా ప్రతిరోజూ గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి అని మనం యాడ్స్ లో చూస్తుంటాం. గుడ్డును కంప్లీట్ ఫుడ్ గా వైద్యులు చెబుతారు. కనీసం రోజుకు ఒక్క కోడిగుడ్డ అయినా తినాలని సూచనలు చేస్తుంటారు. గుడ్డులో విటమిన్స్‌, మినరల్స్‌ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కండరాలను బలంగా ఆరోగ్యంగా మారుస్తాయి. ఎగ్ లోని విటమిన్‌ D ఎముకలను బలంగా ఉంచేలా సాయపడుతుంది. ఒక గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుందని.. గుడ్డులోని తెల్లసొనలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే విటమిన్ D, విటమిన్ B12, రిబోఫ్లావిన్​ తో పాటు కోలిన్.. తదితర విటమిన్లు, ఖనిజాలు గుడ్డులోనే దొరుకుతాయని వైద్యుల మాట.

అయితే తాజాగా ఓ అధ్యయనం సంచలనం సృష్టిస్తోంది. రోజూ గుడ్డు తినేవారి గుండె గుబేల్ మనే వార్త ఇది. ప్రతిరోజూ గుడ్డు తింటే గుండె జబ్బులు, మరణ ప్రమాదం పెరుగుతుందని ఓ అధ్యయనం చెబుతోంది. గుడ్లలోని కొలెస్ట్రాల్ దీనికి కారణమని అధ్యయనం వివరిస్తోంది. JAMA నెట్‌ వర్క్‌లో ప్రచురించిన అసోసియేషన్ ఆఫ్ డయిటరీ కొలెస్ట్రాల్ అండ్ ఎగ్ కన్జంప్షన్ విత్ ఇన్సిడెంట్ కార్డియో వ్యాస్కులర్ డిసీజ్ అండ్ మోర్టాలిటి అనే కొత్త అధ్యయనం ఈ సంచల విషయాన్ని ప్రచురించింది. అయితే చాలామంది నిపుణులు ఈ నివేదికను తిరస్కరిస్తున్నారు.

Eggs Every Day Doctors Reveal Surprising Side Effects of Daily Consumption

ఇక కోడి గుడ్లలో కోలిన్‌ అనే విటమిన్‌ B సమూహం ఉంటుందని ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. అలాగే ఈ విటమిన్ జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంపొందిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే కొంత మందిలో రోజూ గుడ్డు తినడం వల్ల జీర్ణ సమస్యలు రావచ్చని నిపుణులు స్పష్టం చేశారు. అలాగే రోజూ గుడ్డు తినడం వల్ల కొంత మందిలో అలర్జీలు కూడా రావచ్చని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+