వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Electric Rice Cooker Side Effects: రైస్ కుక్కర్‍లో అన్నం వండుతున్నారా.. అయితే ప్రమాదమే..!

|
Google Oneindia TeluguNews

ఒకప్పుడు మట్టి కుండలో వంట చేసుకుని తినేది. ఇలా చాలా ఆరోగ్యకమైన అలవాటు. ఆ తర్వాత పాత్రలు వచ్చాయి. పాత్రల్లో వడ్డిన వంటలు తినేది. ఇప్పుడు ఎలక్ట్రక్ కుక్కర్లు వచ్చాయి. వాటిలో వండిన అన్నం తింటున్నాం. రైస్ కుక్కర్ లో బియ్యం పోసి, వాటర్ పోస్ స్విచ్ వేస్తే చాలు అరగంటలో అన్నం అయిపోతుంది.

విషతుల్యం

విషతుల్యం


దీంతో చాలా మంది రైస్ కుక్కర్లనే వాడుతున్నారు. కానీ ఈ రైస్ కుక్కర్ చేసిన వంట అస్సలు మంచిది కాదట. కుక్కర్‌లో అన్నం, ఫుడ్ వండితే విషతుల్యంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరస్తున్నారు. రైస్ కుక్కర్లు ఎక్కువగా అల్యూమినియంతో తయారుచేస్తారు. అల్యూమినియం పాత్రల్లో వంట చేయటం, తయారుచేసిన ఆహారాన్ని నిల్వ చేయటం మంచి పద్ధతి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గ్యాస్ సమస్యలు

గ్యాస్ సమస్యలు


ఎలక్ట్రిక్ కుక్కర్ లో చేసిన రైస్ తినడం వల్ల ఉదర సంబంద సమస్యలు, గుండె సంబందిత సమస్యలు, కీళ్ల వాతం, మధుమేహం, గ్యాస్ సమస్యలు, అధిక బరువు, నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎలక్ట్రిక్ కుక్కర్ లో రైస్ వండకూడదట. అల్యూమినియం పాత్రలు తప్పనిసరిగా వాడాల్సి వచ్చినప్పుడు వాటిలో ఎక్కువసేపు పుల్లటి, లేదా యాసిడ్ కలిగిన పదార్ధాలను నిల్వ ఉంచకూడదట

జబ్బులు

జబ్బులు


పైగా ఆరోగ్యానికి చాలా మంచిది. రైస్ కుక్కర్ చేసిన అన్నం తినడంలో దీర్ఘకాలంలో జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ పాత్ర టాక్సిన్ మెటల్‌తో తయారవుతుంది. ఇందులో అన్నం ఉడికించడం వల్ల అందులోని పోషకాలు కనుమరుగవుతాయి. నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న రైస్ కుక్కర్లను అస్సలు వాడొద్దని వైద్య నిపుణులు చెడుతున్నారు.

రాగి సంకటి, రాగి జావ

రాగి సంకటి, రాగి జావ


నాన్ స్టిక్ వస్తువులను వినియోగించి వంట చేసే సమయంలో అందులోంచి ప్రమాదకరమైన కెమికల్స్ విడుదలవుతాయి. ఇవి క్యాన్సర్‌కు దారి తీస్తాయి. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లను వాడకపోవడం మంచిది. రాగి సంకటి, రాగి జావ, జొన్న రొట్టెలు, కొర్రలతో అల్పాహారం చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అన్నం త్వరగా వండాలనుకున్నప్పుడు ప్రెజర్ కుక్కర్‌లో వండితే ఆరోగ్యానికి మేలు. కరెంట్ ఆధారంగా ఉడికిన ఆహారం తీసుకోకపోవడమే మంచిది.

మట్టి పాత్రలు

మట్టి పాత్రలు


అందుకే కాస్త లేట్ అయినా పాత్రల్లో వంట చేసుకోవడం మంచిది. ఇక ఊళ్లలో అయితే ప్రశాంతంగా కుండలో రైస్ చేసుకుంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మట్టిపాత్రల్లో అన్నం ఉడికించడం వల్ల మట్టిలోని పోషకాలు ఆహారానికి మరింత రుచిని ఇస్తాయి.

English summary
Many people use rice cookers. But the cooking done by this rice cooker is not good at all. Health experts warn that if rice and food are cooked in a cooker, it becomes toxic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X