తులసి ఆకుల అధిక వినియోగం.. ఆరోగ్యానికి హానికరం!

చాలా మంది తులసి ఆకులను ఆరోగ్యం కోసం ఉపయోగిస్తారు. తులసిలో ఉండే ఔషధ గుణాల కారణంగా తులసి ఆకులను తిన్నా, తులసి రసం తాగినా మంచిదని చెప్తారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో తులసిని అనేక రోగాలను హరించే దివ్య ఔషధంగా చెప్తారు. కానీ తులసి ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అతిగా వినియోగిస్తే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.

తులసి అధిక వినియోగం .. ఆరోగ్యానికి హానికరం
తులసి ఆకుల అధిక వినియోగం సంతాన లేమి సమస్యకు కారణం అవుతుంది. తాజా పరిశోధనలలో ఈ విషయం వెల్లడి అయ్యింది. మన పూర్వీకుల కాలం నుండి తులసిని అనేక ఆయుర్వేద మందులలో వినియోగిస్తున్నప్పటికీ తులసి యొక్క అధిక వినియోగం ఆరోగ్య అనర్ధాలకు దారి తీస్తుంది. తులసి ఆకులను ఎక్కువగా తింటే గర్భిణీ స్తీల ఆరోగ్యం పాడవుతుంది. కొన్ని సందర్భాలలో గర్భ స్రావం కూడా జరిగే ప్రమాదం ఉంది.

Excessive consumption of Tulsi leaves Harmful to health

తులసి ఆకులు గర్భిణీలు తినకూడదు
తులసి ఆకులను తినటం ద్వారా ఇది గర్భాశయం, కటి ప్రాంతాలకు రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. దీని కారణంగా తీవ్రమైన గర్భాశయ సంకోచాలు జరిగి సంతానోత్పత్తి ప్రభావితం అవుతుంది. తులసిఆకులను ఎక్కువగా తినటం పురుషులలో స్పెర్మ్ కౌంట్ ను బాగా తగ్గిస్తుంది. తులసి ఆకుల అధిక వినియోగం బ్లడ్ షుగర్ అసమతుల్యతకు దారి తీస్తుంది.

కాలేయ క్యాన్సర్ ముప్పు
తులసి ఆకుల అధిక వినియోగం కారణంగా కాలేయ ఆరోగ్యం దెబ్బ తింటుంది. తులసి ఆకుల్లో ఎస్ట్రాగోల్ అనే రసాయనం ఉండటం కారణంగా ఇది కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతుంది అందుకే తులసి ఆకులను ఉదయాన్నే పరగడుపున పొరబాటున కూడా తినకూడదని చెబుతుంటారు.

తులసిని రక్త హీనత ఉంటే తీసుకోకూడదు
తులసి ఆకులను తీసుకోవటం వలన దంత క్షయం సమస్య పెరుగుతుంది. దీంతో దంతాల ఆరోగ్యం దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. అధిక రక్తస్రావం సమస్య ఉన్నవారు తులసి ఆకులను ఎక్కువగా తీసుకుంటే రక్త ప్రసరణ వేగం పెరిగి రక్తం గడ్డ కట్టడాన్ని నిరోధిస్తుంది.
రక్త హీనత సమస్యతో బాధ పడేవారు తులసి ఆకులను తినకూడదు. వారు తులసి ఆకులను తింటే రక్తం పలచబడుతుంది.

పళ్ళ మీద ఉండే ఎనామిల్ దెబ్బ తింటుంది
తులసి ఆకులను నేరుగా నమిలితే పళ్ళ మీద ఉండే ఎనామిల్ దెబ్బ తింటుంది. కనుక తులసిని కషాయం రూపంలోనే తీసుకోవటం మంచిది. తులసి ఆకులను ఎక్కువగా తింటే రక్తంలో షుగర్ లెవల్స్ లో దారుణమైన మార్పులు మీకు అనారోగ్యానికి కారణం అవుతాయి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+