మూత్రంలో అతి నురగ... కారణాలివే, నిర్లక్ష్యం చేస్తే తీవ్రనష్టం!

శరీరం ప్రతీరోజూ చేసే ప్రతీ పని దేనికదే ప్రత్యేకం. శరీరంలో అన్ని అంగాలు సరిగ్గా పని చేస్తేనే మనిషి జీవితం సాఫీగా సాగుతుంది. ప్రతీరోజూ శరీరం నుండి జరిగే విసర్జన ప్రక్రియ కూడా సక్రమంగా ఉండి తీరాల్సిందే. మనిషి శరీరం నుండి రోజూ జరిగే మూత్ర విసర్జన విషయంలో కూడా తగిన దృష్టి ఉండాలి.

మూత్ర విసర్జనలో ఈ అంశాలు ముఖ్యం
మూత్రం ఎలా వస్తుంది? ఎన్ని సార్లు వస్తుంది? మూత్రం రంగు ఏంటి? మూత్రంలో నురగ ఎక్కువగా వస్తుందా? మూత్ర విసర్జన సమయంలో ఏమైనా మంట ఉంటుందా? వంటి అంశాలను నిశితంగా గమనించాలి. అయితే చాలా మంది ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కానీ అది అంత మంచిది కాదు.

Excessive foam in urine Serious damage if ignored this urinary problem

మూత్రంలో అతి నురగ
సహజంగా మూత్రవిసర్జన చేసేటప్పుడు నురగ వస్తుంది. అయితే ఈ నురగ రావడం సాధారణమైన విషయమే అయినప్పటికీ కొన్నిసార్లు అతిగా నురగ రావడం, మూత్రం పసుపు రంగులో రావడం మాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అతి నురగకు అనేక కారణాలు ఉండవచ్చని, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా మూత్రంలో అతి నురగ వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

మూత్రంలో అతి నురగ, ఈ సమస్య కావచ్చు
మూత్రం రంగులో, మార్పు మంట ఎక్కువ రోజులు పాటు ఉండటం, అతిగా నురగ రావడం వంటి సమస్య లు వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఇక మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే మూత్రంలో ఎక్కువ నురగ కనిపించే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలు మరింత పాడయ్యే ప్రమాదం ఉంటుంది.

ఈ సమస్యలతో మూత్రంలో అతి నురగ
మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా డయాబెటిస్ కంట్రోల్ లో లేకపోతే మూత్రంలో ఎక్కువ నురగ వస్తుంది. వెంటనే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు వైద్యుడిని సంప్రదించి కానీ, డయాబెటిస్ ని కంట్రోల్ చేసుకుని గాని ఈ సమస్యకు చెక్ పెట్టాలి. లేదంటే కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంటుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లేదా ప్రోస్టేట్ సమస్యలు ఉన్న వారు మూత్రంలో అతినురగను చూస్తారు. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

ఈ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి
ఎవరైతే ఈ తరహా మూత్రంలో అతి నురగ సమస్యతో బాధపడుతున్నారో వారు తప్పనిసరిగా యూరిన్ ఎనాలసిస్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, మైక్రో అల్బుమిన్ పరీక్ష చేయించుకోవాలి. తప్పనిసరిగా మూత్రపిండాల పరిస్థితిని తెలుసుకోవాలి. మూత్రంలో తరచుగా ఎక్కువ నురగ లేదా ముదురు పసుపు లేదా ఎరుపు లేదా అసాధారణ రంగంలో మూత్ర విసర్జన జరిగితే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+