Aloe Vera: కలబందతో ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..

కలబంద.. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే దీన్ని అందం సంరక్షణ కోసం వినియోగించే
పలు ఉత్పత్తుల్లో వాడుతారు. ఇందులో రసంలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. కలబందలో ఉండే పోషకాలు జుట్టును దృఢంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. అలోవెరా జెల్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు బలంగా ఉంటుంది.

చుండ్రు

చుండ్రు


ఈ కలబంద రసాన్ని జుట్టుకు పెట్టుకోవడం వల్ల చుండ్రు తొలగిపోతుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. జుట్టు గ్రోత్ బాగుంటుంది. కలబందలో యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నందున చుండ్రును తొలగించడానికి సహజమైన పరిష్కారంగా కలబంద ఉంటుంది. దీన్ని తలకు అప్లై చేయడం వలన చుండ్రు తగ్గుతుంది.

ఎంజైమ్‌లు

ఎంజైమ్‌లు


కలబందలో ఉండే ఎంజైమ్‌లు జుట్టుకు లోపలి నుంచి పోషణను అందించేందుకు సహాయపడుతుంది. దీని కారణంగా జుట్టు సిల్కీగా, మెరుస్తూ ఉంటుంది. కలబంద జుట్టు నుంచి అదనపు సెబమ్‌ను తొలగిస్తుంది. ఇది జుట్టును ఆయిల్ ఫ్రీగా చేస్తుంది. కలబందలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. దీంతో ఏవైనా గాయాలు అయినప్పుడు ఆ ప్రదేశంలో ఈ జెల్ అప్లై చేస్తే గాయాల వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.

టైప్ 2 డయాబెటిస్

టైప్ 2 డయాబెటిస్

టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లు గ్లాస్ కలబంద రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియత్రణలో ఉంటాయి. కలబంద రసంలో ఆంత్రాక్వినోన్ గ్లైకోసైడ్లు ఉంటాయి. ఇవి మలబద్దకం నుంచి ఉపశమం కలిగిస్తాయి. ఐస్ క్యూబ్ ట్రేలో అలోవెరా జెల్ వేసి ఉంచితే జెల్ క్యూబ్స్ తయారవుతాయి. వీటిని మీ ముఖంపై మృదువుగా రుద్దుకుంటే సహజ మెరుపు సంతరించుకుంటుంది.

చర్మం

చర్మం

అలోవెరా జెల్‌ను మీ చర్మంపై నేరుగా అప్లై చేయవచ్చు. దీని వలన చర్మం తేమగా మారుతుంది.కలబందలో ఆస్ట్రింజెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాల కారణంగా మచ్చలను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది.చలికాలంలో కలబందను అప్లై చేయడం వల్ల జుట్టుకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+