విపరీతమైన అలసట, నిద్రలేమి.. ఆ విటమిన్ లోపం కావచ్చు!

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావలసిన అన్ని పోషకాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. మన శరీరానికి కావలసిన విటమిన్స్, మినరల్స్, అన్ని సమపాళ్లల్లో ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. మన శరీరానికి కావలసిన విటమిన్స్ లో లోపం జరిగితే అది మనకు అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా శరీరానికి అవసరమైన విటమిన్ బి12 లోపం ఉంటే ఎటువంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రస్తుతం తెలుసుకుందాం.

విటమిన్ బి12 లోపం .. ఆరోగ్యానికి హాని
విటమిన్ బి12 లోపం ఉంటే కాళ్లు, చేతులలో కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి. విటమిన్ బి12 లోపాన్ని పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు. విటమిన్ బి12 లోపం ఉంటే కాళ్లు, చేతులు జలదరించినట్టుగా అనిపిస్తుంది. విటమిన్ బి12 లోపం వల్ల నరాల చుట్టూ ఉండే రక్షణ కవచం దెబ్బతిని ఈ విధంగా జరుగుతుంది. విటమిన్ బి12 లోపం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. మన నడకలో కూడా మార్పులు వస్తాయి.

Extreme fatigue insomnia it could be vitamin b12 deficiency

బాగా అలసటగా ఉంటుందా?
కాళ్లు చేతులు తరచూ తిమ్మిరిగా అనిపించినా, విటమిన్ బి12 లోపం ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. విటమిన్ బి 12 లోపం ఉంటే చర్మం పేలవంగా మారుతుంది. అరచేతులు కూడా పసుపుపచ్చగా కనిపిస్తాయి. ఇక ఎంత తక్కువ పని చేసినా కూడా అలసిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు అంటే అది విటమిన్ బి 12 లోపమే. ఇది చాలా మందిలో కనిపించే ముఖ్యమైన లక్షణం.

విటమిన్ బీ 12తో అనేక అనారోగ్య సమస్యలు
విటమిన్ బి12 లోపం ఉంటే కండరాల బలహీనత వస్తుంది. నిస్సత్తువ, వణుకు వంటి సమస్యలు వస్తాయి. నోట్లో తరచూ పుండ్లు కావడం, నోటి అల్సర్స్ రావడం, మానసిక ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు వస్తాయి. జుట్టు రాలడం, జుట్టు రంగు తెల్లగా మారడం, పలచన అవ్వడం జరుగుతాయి. నిద్రలేమి సమస్యతో బాధపడతారు. శ్వాసలో ఇబ్బంది వస్తుంది. బరువు తగ్గుతారు. ఆలోచనలో మార్పులు వస్తాయి.

శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే విటమిన్ బీ 12
తరచూ చిరాకుగా ఉంటుంది . చర్మం పొడిబారుతూ ఇబ్బంది కలిగిస్తుంది. విటమిన్ బి12వ లోపం కారణంగా చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి. గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కనుక విటమిన్ బి12 లోపం ఉంటే పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు. కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకొని విటమిన్ బి12 లోపాన్ని నివారించే మంచి ఆహారాలను తీసుకోవాలి. సమస్య ఎక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+