Fitness tips: కత్రినా కైఫ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!!
బాలీవుడ్ లో ఉన్న నటీమణులలో కత్రినా కైఫ్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కత్రినా కైఫ్ నటన చాలా మందికి బాగా నచ్చుతుంది. కత్రినా కైఫ్ కేవలం నటనకు మాత్రమే కాదు ఆమె అందానికి, ఫిట్నెస్ కు కూడా పేరు పొందిన నటీమణి. అయితే అందరూ కత్రినా కైఫ్ లా అందంగా, నాజూగ్గా, మంచి ఫిట్నెస్ తో ఉంటే బాగుండు అని భావిస్తారు.
అలాంటి వాళ్ళు ముందు ఆమె అలా ఉండటం వెనుక ఉన్న సీక్రెట్ తెలుసుకోవాలి. కత్రినా కైఫ్ ఎప్పుడూ ఫిట్నెస్ కోసం సమతుల, పౌష్టికాహారం తీసుకుంటారు. ఆమె ఆహరం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కత్రినా కైఫ్ ప్రతీరోజూ వ్యాయామం, యోగా చేస్తారు. దీంతో పాటు ఆమె మంచి ఆహారం తీసుకుంటారు.

కత్రినా కైఫ్ తన ఆహారంలో ముఖ్యంగా మూడు కూరగాయలను ఎక్కువగా తీసుకుంటారు. కత్రినా కైఫ్ కు ఇష్టమైన కూరగాయల విషయానికి వస్తే కత్రినా కైఫ్ ఎక్కువగా క్యాలీ ఫ్లవర్, సొరకాయ, బ్రోకలీ తింటారని చెప్తున్నారు. సొరకాయలో పీచు మరియు నీరు ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవటం వల్ల బరువు తగ్గుతారు.
ఇక క్యాలీ ఫ్లవర్ లో అవసరం అయిన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రీ రాడికల్స్ నుండి కాపాడుతాయి. చర్మానికి మెరుపును ఇస్తాయి. క్యాలీఫ్లవర్ తో బరువు తగ్గుతుంది. అలాగే జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. బ్రోకలీలో ప్రోటీన్, కాల్షియం, కార్బోహైడ్రేడ్, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి మొదలైన పోషకాలు లభిస్తాయి. బ్రోకలీతో బరువు తగ్గుతారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి బలం చేకూరుతుంది.
కత్రినా కైఫ్ ముఖ్యంగా ఈ మూడు కూరగాయలను ఇష్టపడతారని చెప్తారు. వీటిని ఎక్కువగా తీసుకోవటం వల్లే కత్రినా కైఫ్ నాజూగ్గా అందంగా ఉన్నారని చెప్తున్నారు. మంచి పోశాకాహారమే అందానికి సీక్రెట్ అని కత్రినా కైఫ్ చెప్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications