గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.. బరువును తగ్గిస్తాయి!

ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది అందరిదీ. దీనివల్ల విపరీతంగా బరువు పెరిగి గుండె జబ్బులకు గురవుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పోషకాహారం తీసుకుంటే సరిపోదు.. వ్యాయామాలు చేస్తుండాలి. ప్రధానంగా వాల్‌నట్స్, పైన్ నట్స్, బాదం, పీనట్, జీడీపప్పు, పిస్తా లో యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్, మంచి కొవ్వులు, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. బరువును తగ్గించి గుండెను సంరక్షించడంలో ఇవి ఏవిధంగా ప్రయోజనకారిగా ఉంటాయో తెలుసుకుందాం.

పోషక విలువలు ఎక్కువగా ఉండే నట్స్ ను డైట్ లో చేర్చుకుంటే గుండెను కాపాడుకున్నట్లే. సులువుగా బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడంలో వీటి పాత్ర ఎంతో కీలకం. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. ఖర్జూరా, సలాడ్, స్మూతీ, తాజా పండ్లకు నట్స్ జోడిస్తే రుచితో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలు, ఖనిజాలు లభిస్తాయి.

five nuts health benefits and uses in telugu

బాదం: విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే బాదం పోషకాలకు గనిలాంటిది. షుగరు లెవల్స్ ను నియంత్రిస్తుంది. తరుచుగా తీసుకుంటుంటే ఆకలి తగ్గుతుంది. దీనివల్ల బరువు తగ్గుతారు. వీటిని పచ్చిగా తినొచ్చు.. లేదంటే వేయించుకొని తినొచ్చు. వీటిని రాత్రంతా నానబెట్టి పరగడుపునే తింటే శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి.

five nuts health benefits and uses in telugu

వాల్‌నట్స్ : ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. స్ట్రెస్ తో పోరాడటానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రభావాన్ని తగ్గిస్తాయి. రాత్రిపూట నానబెట్టి ఉదయం తింటే చాలా మంచిది.

five nuts health benefits and uses in telugu

జీడిపప్పు : మంచి కొవ్వు, ప్రొటీన్, మాంగనీస్, జింక్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో స్టెరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో ఎల్‌డీఎల్ లెవల్స్ తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి. ఆకలి వేయదు.. దీనివల్ల బరువు తగ్గుతారు. వీటిని పచ్చిగా తినవచ్చు.. ముద్దగా చేసుకొని కూరల్లో కూడా వేసుకోవచ్చు.

five nuts health benefits and uses in telugu

పీనట్: సాధారణంగా నట్స్ ఖరీదైనవి. పీనట్స్ మాత్రం తక్కువ ధరకే లభిస్తాయి. మంచి కొవ్వు, ప్రొటీన్, కార్బొహైడ్రేట్స్, వివిధ రకాల విటమిన్స్, ఖనిజాలకు పీనట్స్ పవర్ హౌస్ లాంటిది. రాత్రిపూట నానబెట్టి మొలకెత్తిన తర్వాత తింటే వీటి ప్రయోజనం బాగా అందుతుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. క్యాన్సర్లు, అల్జీమర్స్ వంటి నరాల వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తాయి.

పిస్తా : యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. వీటిల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. పిస్తాల్లో ఫైబర్స్, ఖనిజాలు తగిన మోతాదులో ఉంటాయి. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ లెవల్స్ ను నియంత్రిస్తాయి. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. వీటిని తరుచుగా డైట్ లో చేర్చుకుంటుండాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+