50లలో 20లా కనిపించాలంటే శిల్పాశెట్టి డైట్ సీక్రెట్స్ ఫాలో కండి!
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి 50ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల వయసు ఉన్నట్టు కనిపిస్తారు. శిల్పాశెట్టి ఆరోగ్యకరమైన జీవనం విషయంలో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు. ప్రతిరోజు యోగా చేయడంతో పాటు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. తన రోజువారి ఆహారంలో శరీరానికి పుష్కలంగా పోషకాలను అందించే సూపర్ ఫుడ్ లను చేర్చుకోవడం ఆమె ఫుడ్ సీక్రెట్. ఈ పోషక పదార్థాలు ఆమెను అందంగా, ఆకర్షణీయంగా ఉండేలా చేస్తున్నాయి.
శిల్పా శెట్టి జాబితాలో ఉన్న సూపర్ ఫుడ్ లు ఇవే
శిల్పా శెట్టి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటారు. ముఖ్యంగా ప్రోటీన్ రిచ్ ధాన్యం అయిన క్వినోవా ఆమెకు ఇష్టమైన ఆహారాలలో ఒకటి. ఇది గ్లూటెన్ రహితంగా ఉండి, ముఖ్యమైన అమైనో ఆమ్లాలతో కూడుకుని ఉంటుంది. ఆమె ఆహారంలో కచ్చితంగా తీసుకునే మరొక పదార్థం చియా సీడ్స్. ఇవి అధిక ఒమేగా-3 కలిగి కంటెంట్ ను, ఫైబర్ ను కలిగి ఉంటుంది.

పండ్లు మరియు కూరగాయలు
శిల్పా శెట్టి తన ఆహారంలో పండ్లకు చాలా ప్రత్యేకమైన స్థానం ఇస్తుంది. ముఖ్యంగా పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను ఎదుర్కోవడంలో సహాయం చేస్తాయి. ఇక పండ్లు మాత్రమే కాకుండా ఆకుకూరలు, కూరగాయలు క్యాల్షియం, ఐరన్ రిచ్ గా ఉండే ఆహారాలను శిల్పా శెట్టి తీసుకుంటారు. ఆరోగ్యమైన కొవ్వులు, విటమిన్లతో ఉండే అవకాడో లను కూడా శిల్పా శెట్టి తీసుకుంటారు.
ఆహారంలో సీడ్స్, నట్స్
బాదంపప్పు, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ వంటి నట్స్, సీడ్స్ ను శిల్పా శెట్టి తన ఆహారంలో భాగంగా చేసుకుంటారు. ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆరోగ్యకరమైన కొవ్వును మన శరీరానికి అందించే వాటిని ఆమె ఎక్కువగా ఇష్టపడతారు. ఫ్లాక్స్ సీడ్స్ లో ఫైబర్ మరియు మెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం జీర్ణక్రియకు దోహదం చేయడమే కాకుండా, గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
ఆమె ఫుడ్ లో ఇవి మస్ట్
ఇక శిల్పా శెట్టి ఆహారంలో నెయ్యిని తప్పనిసరిగా తీసుకుంటారు. ఓట్స్ వంటి అధిక ఫైబర్ కలిగిన ఆహారాలను కూడా శిల్పశెట్టి తీసుకుంటారు. సూప్స్, గ్రిల్డ్ ఐటమ్స్ ఎక్కువగా ఆహారంలో ఉంటాయి. చక్కెరతో తయారు చేసిన ఆహారం శిల్పా శెట్టి తీసుకోరు.












Click it and Unblock the Notifications