ఇలా చేయండి... జీవితంలో హార్ట్ ఎటాక్ రమ్మన్నా రాదు

ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి గుండెపోటు వస్తోంది. చిన్నవయసులోనే హార్ట్ ఎటాక్ తో ఎంతోమంది మరణిస్తున్నారు. అందుకే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన గుండెను ఎంత కాలం జాగ్రత్తగా కాపాడుకుంటే అంతకాలం ఎక్కువగా జీవిస్తాం. సమయానికి ఆహారాన్ని తీసుకోవడంతోపాటు కొన్ని కొత్త అలవాట్లు నేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.

వ్యాయామం: ఉద్యోగానికి ఈరోజుల్లో ప్రధానంగా అవసరమయ్యేది మైండ్. దీంతో పనిచేస్తుండటంవల్ల శరీరానికి శ్రమ ఉండదు. మైండ్ తో చేస్తున్నాం కదా అని శరీరాన్ని కష్టపెట్టకపోతే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు వ్యాయామం చేయడంతోపాటు ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తుండాలి. అలాగే రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ తోపాటు జిమ్ కు వెళుతుండటం చేస్తుండాలి. ప్రతిరోజు కనీసం 40 నిముషాలు నడిస్తే గుండె పదిలంగా ఉంటుంది.

heart attack

ఒత్తిడి లేకుండా: మైండ్ తో చేసే పనులవల్ల మనకు తెలియకుండానే ఒత్తిడి కలుగుతుంది. దీన్ని నియంత్రించకపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది.

తాజా కూరగాయలు: ఆకుపచ్చని కూరగాయలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటితోపాటు ఆరోగ్యాన్ని రక్షించే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకుంటుండాలి. ప్రధానంగా చాలామంది మితిమీరి తింటుంటారు. ఆ అలవాటును మానుకోవాలి. ఎంతవరకు అవసరమో అంతే తినాలి. 40 సంవత్సరాల వయసు దాటినవారు ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు చేయించుకోవాలి. డయాబెటిస్, థైరాయిడ్, ఈసీజీ, కొలెస్ట్రాల్ వంటి పరీక్షలు చేయించుకొని జాగ్రత్తలు తీసుకుంటుండాలి. ఎక్కువగా తినడాన్ని తగ్గించుకోవాలి. మనసును సంతోషంగా ఉంచేలా చూసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+